Breaking News

వచ్చి తీసుకోవాల్సిందే: నఖ్వీ ఓవరాక్షన్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం

Published on Wed, 10/22/2025 - 08:43

న్యూఢిల్లీ: ఆసియా కప్‌ టీ20 క్రికెట్‌ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచి దాదాపు నెల రోజులు కావస్తున్నా టోర్నీకి సంబంధించిన ట్రోఫీ మాత్రం ఇంకా టీమ్‌కు అందలేదు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) అధ్యక్షుడు మొహసిన్‌ నఖ్వీ (Mohsin Naqvi) ఆదేశాల మేరకు ఇప్పటికీ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. 

ఈ విషయంపై దీనిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ఏసీసీకి లేఖ రాసింది. ఏసీసీలోని సభ్య దేశాలైన శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ జట్లు కూడా బీసీసీఐకి మద్దతు పలుకుతూ వెంటనే ట్రోఫీని భారత జట్టుకు అందించాలని కోరాయి. బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా, రాజీవ్‌ శుక్లా లేఖ రాసిన విషయాన్ని ఏసీసీ అధికారి ఒకరు నిర్ధారించారు. 

అయితే నఖ్వీ మాత్రం తన మొండితనాన్ని వీడలేదు. బీసీసీఐకి సంబంధించినవారు ఎవరైనా దుబాయ్‌కు వచ్చి తన చేతుల మీదుగా తీసుకుంటేనే దానిని అందిస్తామని అతడు పునరుద్ఘాటించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. దాంతో ఆసియా కప్‌ ఫైనల్‌ రోజులాంటి యథాతథ స్థితి ఇంకా కొనసాగుతోంది. 

నా చేతుల మీదుగా తీసుకోవచ్చు
బీసీసీఐ లేఖపై తాజాగా నఖ్వీ స్పందించాడు. ‘ఆసియా కప్‌ ఫైనల్‌ రోజు నా చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని భారత్‌ చివరి క్షణం వరకు చెప్పలేదు. వేదికపై అతిథులంతా చేరిన తర్వాత ఆ విషయం తెలిసింది. మేం 40 నిమిషాలు వేచి చూసినా ఎవరూ రాలేదు. ఆసియా కప్‌ ట్రోఫీ భారత్‌దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

కాబట్టి బీసీసీఐ ప్రతినిధి ఎవరైనా ఆసియా కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన ఆటగాడు ఒకరితో కలిసి ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా తీసుకోవచ్చు’ అని అదే మాట చెప్పాడు. ఈ ప్రతిష్టంభనకు ఏసీసీలో పరిష్కారం లభించదని భారత బోర్డుకు అర్థమైంది. త్వరలో జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి  సమావేశంలో నఖ్వీపై ఫిర్యాదు చేయాలని... అక్కడే ఏదో ఒకటి తేల్చుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది.

చదవండి: పాకిస్తాన్‌ అవుట్‌    

Videos

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)