Breaking News

అభిషేక్‌ శర్మ ఓవర్లో సర్ఫరాజ్‌ విశ్వరూపం.. 15 బంతుల్లోనే..

Published on Thu, 01/08/2026 - 14:17

ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ మరోసారి బ్యాట్‌ ఝులిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పంజాబ్‌ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. ముఖ్యంగా పంజాబ్‌ కెప్టెన్‌, పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మకు చుక్కలు చూపించాడు.

15 బంతుల్లోనే
అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) వేసిన ఓవర్లో సర్ఫరాజ్‌ వరుసగా 6,4,6,4,6,4 బాదాడు. వన్‌డౌన్‌లో వచ్చి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఒకే ఓవర్లో ఏకంగా ముప్పై పరుగులు పిండుకున్నాడు. వన్డే మ్యాచ్‌లో టీ20 తరహాలో విశ్వరూపం ప్రదర్శిస్తూ కేవలం.. 15 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.

మార్కండే బౌలింగ్‌లో
పంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfraz Khan).. 62 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే, మయాంక్‌ మార్కండే బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరగడంతో సర్ఫరాజ్‌ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

అభిషేక్‌ ఫెయిల్‌
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 ఎలైట్‌ గ్రూపులో భాగంగా.. జైపూర్‌ వేదికగా పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ చేసింది. కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (8) సహా మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (11).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్నూర్‌ సింగ్‌ డకౌట్‌ కావడంతో ఆదిలోనే పంజాబ్‌కు షాక్‌ తగిలింది.

అన్మోల్‌, రమణ్‌ అర్ధ శతకాలు
ఈ క్రమంలో అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ అర్ధ శతకం (57)తో రాణించగా.. నమన్‌ ధిర్‌ (22) అతడికి సహకరించాడు. ఇక రమణ్‌దీప్‌ సింగ్‌ సైతం హాఫ్‌ సెంచరీ (72)తో ఆకట్టుకున్నాడు. అయితే, మిగతా వారంతా తేలిపోవడంతో 45.1 ఓవర్లలో కేవలం 216 పరుగులు చేసి పంజాబ్‌ ఆలౌట్‌ అయింది.

ముంబై బౌలర్లలో సర్ఫరాజ్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. శివం దూబే, శశాంక్‌ అట్రాడే, ఓంకార్‌ తుకారాం టర్మాలే తలా రెండు వికెట్లు కూల్చారు. సాయిరాజ్‌ పాటిల్‌కు ఒక వికెట్‌ దక్కింది. నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై ధనాధన్‌ బ్యాటింగ్‌తో విజయం దిశగా పయనించిన ముంబై.. అనూహ్య రీతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.

చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్‌.. సెలక్టర్లు పట్టించుకోరుగా!

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)