Breaking News

‘బుమ్రా లేకుండా గెలవడం యాదృచ్ఛికమే

Published on Thu, 08/07/2025 - 04:05

ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ముందుగా అనుకున్నట్లుగా మూడు మ్యాచ్‌లే ఆడాడు. అయితే అతను బరిలోకి దిగని బర్మింగ్‌హామ్, ఓవల్‌ టెస్టులలోనే టీమిండియా గెలిచింది. దాంతో బుమ్రా లేకపోయినా పెద్దగా తేడా రాదని, అతను లేకపోయినా మ్యాచ్‌లు గెలవగలమని కొన్ని విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ స్పందించాడు. అసాధారణ బౌలర్‌ అయిన బుమ్రా గురించి తప్పుగా మాట్లాడవద్దంటూ అండగా నిలిచాడు. 

‘బుమ్రా సిరీస్‌ను చాలా బాగా మొదలు పెట్టాడు. ఆడింది మూడు మ్యాచ్‌లే అయినా... తొలి టెస్టులో ఒకసారి, మూడో టెస్టులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ప్రజలు వేరే అంశాలు ముందుకు తెచ్చి అతను లేని టెస్టుల్లో భారత్‌ గెలిచిందంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ నా అభిప్రాయ ప్రకారం అది యాదృచ్ఛికం మాత్రమే. బుమ్రా ఒక అసాధారణ బౌలర్‌. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. చాలా కాలంగా నిలకడగా రాణించాడు. 

నా దృష్టిలో నిస్సందేహంగా అందరికంటే అతను అగ్ర స్థానంలో ఉంటాడు’ అని సచిన్‌ కితాబిచ్చాడు. మాంచెస్టర్‌ టెస్టులో స్టోక్స్‌ ‘షేక్‌ హ్యాండ్‌’కు నిరాకరించి జడేజా, సుందర్‌ ఆటను కొనసాగించడంలో ఎలాంటి తప్పూ లేదని టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. ‘డ్రా’కు అంగీకరించాలని ఇంగ్లండ్‌ కోరడంలో అర్థం లేదన్న సచిన్‌... భారత బ్యాటర్లు స్పందించిన తీరుతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని అన్నాడు. 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి