తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే!

Published on Mon, 07/13/2026 - 13:46

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీ20 సిరీస్‌లో దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత శుబ్‌మ‌న్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వ‌న్డే సిరీస్ ఆడేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా మంగ‌ళ‌వారం (జూలై 14న) ఇరుజ‌ట్లు తొలి వ‌న్డే మ్యాచ్ ఆడ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే టెస్టులు, టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లికిన సీనియర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ వ‌న్డే జ‌ట్టుతో క‌లిశారు. ఇక తొలి వన్డేకు తుది జట్టు అంచనా ఒకసారి పరిశీలించి చూద్దాం.

వీరితో పాటు సీనియ‌ర్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా కూడా జాయిన్ కావ‌డంతో టీమిండియా బ‌లం పెరిగింది. 20 ఓవ‌ర్ల ఫార్మాట్ నుంచి 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌కు ఆట మార‌డానికి తోడు, సీనియ‌ర్లు అంతా జ‌ట్టులోకి రావ‌డంతో టీమిండియా ఇప్పుడు పేప‌ర్‌పై దుర్భేద్యంగా క‌నిపిస్తోంది. 39 ఏళ్ల రోహిత్‌, 38 ఏళ్ల కోహ్లికి 2027 వ‌న్డే  ప్ర‌పంచ‌కప్ ఆఖ‌రిది కానుండ‌డంతో వీరిద్ద‌రు రాణించాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. 

టీ20 సిరీస్‌లో జోఫ్రా ఆర్చ‌ర్‌, జోష్ టంగ్‌లు త‌మ బౌలింగ్‌తో టీమిండియా బ్యాట‌ర్ల‌ను బెంబెలెత్తించారు. కానీ వ‌న్డే ఫార్మాట్‌లో కోహ్లి, రోహిత్ వంటి అనుభ‌వ‌జ్ఞులు రావ‌డంతో ఈ ఇద్ద‌రు బౌల‌ర్ల ఆట‌లు సాగ‌క‌పోవ‌చ్చ‌ని అభిమానులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. బ్యాటింగ్‌లో గిల్‌, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో పాటు కేఎల్ రాహుల్ కీల‌కంగా మార‌నున్నారు.

ఆల్‌రౌండ్ విభాగంలో అక్ష‌ర్‌ప‌టేల్‌, శివ‌మ్ దూబే, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు ఉన్న‌ప్ప‌టికీ వీరిలో ఇద్ద‌రికి మాత్రమే అవ‌కాశం రానుంది. ఇక బౌలింగ్ విభాగాన్ని జ‌స్‌ప్రీత్ బుమ్రా  న‌డిపించ‌నుండ‌గా.. టీ20 సిరీస్‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ అర్ష్‌దీప్‌కు మ‌రో చాన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో స్పిన్న‌ర్ అవ‌స‌ర‌మ‌నుకుంటే కుల్దీప్ యాద‌వ్ తుదిజ‌ట్టులో చోటు ద‌క్కించుకుంటాడు. లేదంటే ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్‌ల‌లో ఒక‌రికి అవ‌కాశం క‌ల్పించ‌వ‌చ్చు. మొత్తానికి టీ20 సిరీస్‌లో ఓట‌మి  పాలైనప్ప‌టికీ వ‌న్డే సిరీస్‌కు మాత్రం సీనియ‌ర్ల రాక‌తో టీమిండియా కొత్త‌గా కనిపిస్తోంది. 

మ్యాచ్‌ సమయం: భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ప్రారంభం కానుంది.

తుదిజ‌ట్టు అంచ‌నా: 
శుబ్‌మ‌న్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, శ్రేయ‌స్ అయ్య‌ర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), శివ‌మ్ దూబే, అక్ష‌ర్ ప‌టేల్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాద‌వ్‌, ప్ర‌సిధ్ క్రిష్ణ‌/ గుర్నూర్ బ్రార్‌

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)