Breaking News

రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీ.. 8 సిక్స్‌లతో వీర వీహారం! వీడియో

Published on Fri, 08/22/2025 - 10:23

ఆసియాక‌ప్‌-2025కు ముందు టీమిండియా బ్యాట‌ర్ రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. యూపీ టీ20 లీగ్‌-2025లో  మీరట్ మావెరిక్స్ సారథ్యం వహించిన రింకూ సింగ్‌.. గురువారం  గౌర్ గోరఖ్ పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.

168 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన రింకూ ప‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. లక్నోల‌ని ఎకానా స్టేడియంలో రింకూ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. ఓట‌మి ఖాయ‌మైన చోట ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ త‌న తుపాన్ ఇన్నింగ్స్‌తో అద్భుతం చేశాడు.

కేవ‌లం 48 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న సింగ్‌.. 7 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో 108 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచాడు. దీంతో 168 ప‌రుగుల టార్గెట్‌ను మీరట్ మావెరిక్స్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. గోర‌ఖ్ పూర్ బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్‌, అనికిత్ చౌద‌రీ, ఏ రెహ‌మ‌న్‌, విజ‌య్ యాద‌వ్ త‌లా వికెట్ సాధించారు.

అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన గోర‌ఖ్ పూర్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. గోరఖ్‌పూర్‌ కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌(38) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. నిశాంత్ కుష్వాహా(37), శివమ్‌ శర్మ(25) రాణించారు. మీరట్‌ బౌలర్లలో విశాల్‌ చౌదరి, విజయ్‌ కుమార్‌ తలా మూడు వికెట్లు పగొట్టగా.. జీసన్‌ అన్సారీ రెండు వికెట్లను తీశాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. ఆసియాకప్‌నకు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కింది. అయితే ఫామ్‌లేనప్పటికి రింకూకు ఛాన్స్‌ ఇవ్వడాన్ని చాలా మంది తప్పుబట్టారు. కానీ ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారికి రింకూ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.

ఆసియా కప్‌ టీ20-2025 టోర్నమెంట్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), హర్షిత్ రాణా, రింకూ సింగ్‌.
చదవండి: UPT20: రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీ.. 8 సిక్స్‌లతో వీర వీహారం! వీడియో

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)