Breaking News

జీవితంలో ఎన్నడూ బ్యాట్‌ పట్టనోడు క్రికెట్‌కు ఇన్‌చార్జ్‌ అయ్యాడు..!

Published on Wed, 09/04/2024 - 19:45

త్వరలో ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న బీసీసీఐ కార్యదర్శి జై షాపై కాంగ్రెస్‌ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన కామెంట్స్‌ చేశారు.  జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నడూ బ్యాట్‌ పట్టుకోని వ్యక్తి క్రికెట్‌కు ఇన్‌చార్జ్‌ అయ్యాడని విమర్శలు గుప్పించారు. దేశం మొత్తంలో వ్యాపారాలు ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తల కనుసన్నల్లో నడుస్తున్నాయని అన్నాడు. 

రాహుల్‌ వ్యాఖ్యలు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా, ప్రస్తుతం వైరలవుతుంది. జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యాక ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సైతం ఇలాంటి వ్యంగ్యమైన వ్యాఖ్యలే చేశాడు. కాగా, జై షా.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిషా షా కుమారుడన్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, కొద్ది రోజుల క్రితమే జై షా ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 17 మంది సభ్యులున్న ఐసీసీ ప్యానెల్‌లో పాకిస్థాన్‌ మినహా అందరూ జై షాకు మద్దతు తెలిపారు. షా.. ఈ ఏడాది డిసెంబర్‌ 1న ఐసీసీ చైర్మన్‌ బాధ్యతలు చేపడతారు. భారత్‌ నుంచి ఈ బాధ్యతలు చేపట్టబోయే ఐదో వ్యక్తి జై షా. గతంలో జగ్మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్‌, శ్రీనివాసన్‌, శశాంక్‌ మనోహర్‌ ఐసీసీ చైర్మన్లుగా పని చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)