Breaking News

అది లీగల్‌: పాక్‌ స్పిన్నర్‌కు అశ్విన్‌ మద్దతు

Published on Wed, 02/11/2026 - 14:28

పాకిస్తాన్‌ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌కు టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ అండగా నిలిచాడు. అతడి బౌలింగ్‌ యాక్షన్‌ను పెద్దగా తప్పుబట్టాల్సిన పనిలేదన్నాడు. క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్‌ చేయడంలో తప్పులేదని.. అది అతడి సహజ శైలి అని మద్దతుగా నిలిచాడు.

పాకిస్తాన్‌ తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ఉస్మాన్‌ తారిఖ్‌ రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆడే పాక్‌ జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. మంగళవారం అమెరికాతో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ తారిఖ్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

అయితే, ఉస్మాన్‌ ప్రదర్శన కన్నా అతడి బౌలింగ్‌ యాక్షన్‌ తీరే నెట్టింట వైరల్‌గా మారింది. సందేహాస్పద రీతిలో అతడు బౌలింగ్‌ చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్‌ శ్రీవత్స్‌ గోస్వామి ఘాటుగా స్పందించాడు.

ఇది కొనసాగకూడదు
‘‘పెనాల్టీ రన్‌ అప్‌ సమయంలో ఫుట్‌బాల్‌లో కూడా ఇలాంటివి అనుమతించరు. అతడి బౌలింగ్‌ యాక్షన్‌ ఏవిధంగా సమంజసం? సరే సరిగ్గానే బౌలింగ్‌ చేశాడనుకుందాం. మరి పాజ్‌ (కాసేపు ఆగడం) ఎందుకు ఇచ్చినట్లు? అది కూడా బంతిని రిలీజ్‌ చేసే సమయంలో ఇలా ఎందుకు చేశాడు? ఇది కొనసాగకూడదు’’ అని శ్రీవత్స్‌.. ఉస్మాన్‌ బౌలింగ్‌ చేస్తున్న దృశ్యాన్ని పంచుకున్నాడు.

 బౌలర్‌ మీదే ఆంక్షలు ఎందుకు?
ఇందుకు అశ్విన్‌ స్పందిస్తూ.. ‘‘నిజమే.. ఫుట్‌బాల్‌లో కూడా ఇలాంటివి అనుమతించరు. మరి ఓ బ్యాటర్‌ స్విట్‌ హిట్‌ లేదంటే రివర్స్‌ షాట్‌ ఆడుతున్నపుడు అంపైర్‌ లేదంటే బౌలర్‌కు సమాచారం ఇవ్వకుండానే షాట్లు ఆడతారు కదా.

అలాంటపుడు బ్యాటర్‌ మీద లేని ఆంక్షలు బౌలర్‌ మీదే ఎందుకు? నిజం చెప్పాలంటే బౌలర్‌ తన చేతివాటాన్ని మార్చే ముందు కచ్చితంగా అంపైర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనను తొలుత మార్చాలి.

ఏదేమైనా ఉస్మాన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ చట్టబద్ధమా? కాదా? అన్నది ఐసీసీ బౌలింగ్‌ యాక్షన్‌ టెస్టింగ్‌ సెంటర్‌లో మాత్రమే తేలుతుంది. అక్కడ మాత్రమే అతడిని పరీక్షించే అవకాశం ఉంటుంది.

అతడి సహజశైలి కాబట్టి లీగలే
నిబంధన ప్రకారం.. మోచేయిని నిటారుగా చేసి బంతిని రిలీజ్‌ చేయాలి. అయితే, అతడు బంతిని విసురుతున్నాడా? లేదంటే సరిగ్గానే బౌలింగ్‌ చేస్తున్నాడా అన్నది ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ధారించడం అసాధ్యం.

ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మ్యాచ్‌ జరుగుతున్నపుడు రియల్‌టైమ్‌ టెస్టింగ్‌ టూల్‌ను వాడాలి. కానీ ఇక్కడ సరైన ఆధారం లేకుండా ఒకరిని నిందించడం తప్పు. ఏదేమైనా క్రీజులోకి వచ్చాక అలా పాజ్‌ ఇవ్వడం చట్టబద్ధమో కాదో చెప్పలేము. అయితే, అది అతడి సహజశైలి కాబట్టి లీగలే అని నేను నమ్ముతాను’’ అంటూ అశ్విన్‌ బదులిచ్చాడు.

ఈ నేపథ్యంలో శ్రీవత్స్‌కు మద్దతుగా.. అశ్విన్‌ను వ్యతిరేకిస్తూ టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. ఉస్మాన్‌ బౌలింగ్‌ చేయకుండా బంతిని విసురుతున్న తీరు కనిపిస్తుంటే అశూ.. అతడికి మద్దతునివ్వడం ఏమాత్రం బాగాలేదంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన బంగ్లాదేశ్

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)