Breaking News

‘కళ్లుచెదిరే ప్రదర్శన.. వైభవ్‌ ఆట ఆకట్టుకుంది’

Published on Mon, 05/05/2025 - 11:57

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో సంచలన బ్యాటింగ్‌తో అందరికంటా పడిన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలతో ముంచెత్తారు. అతడు పడిన కష్టం, ఆడిన తీరు తనని అమితంగా ఆకట్టుకుందని అన్నారు. బిహార్‌లో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌ ఆరంభోత్సవం సందర్భంగా మోదీ వీడియో సందేశం ఇచ్చారు. 

కళ్లుచెదిరే ప్రదర్శన
ఈ సందర్భంగా క్రీడాకారుల కష్టాన్ని కొనియాడిన ఆయన వైభవ్‌ విధ్వంసక శతకాన్ని ఆ వీడియో సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ‘బిహార్‌ ముద్దుబిడ్డ వైభవ్‌ సూర్యవంశీ. అతను ఆడిన మ్యాచ్‌ను చూశాను. 14 ఏళ్ల కౌమార ప్రాయంలోనే కళ్లుచెదిరే ప్రదర్శన కనబరిచాడు.

ఇన్నాళ్లు ఏ భారత బ్యాటర్‌కు సాధ్యంకానీ రికార్డును సాధించిన ఘనత వైభవ్‌కే దక్కుతుంది. ఇంతచిన్న వయసులో అంతటి ఇన్నింగ్స్‌ ఆడటం మాటలు కాదు. దీనికోసం అతనెంతో కష్టపడ్డాడు. ఆటకోసం తపించాడు. 

అంకితభావంతో ముందడుగు వేశాడు. అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అని ఆ సందేశంలో ప్రశంసల మోదీ వర్షం కురిపించారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంతో తమ ప్రభుత్వం క్రీడాకారుల సాఫల్యం కోసం కృషిచేస్తోందని చెప్పారు. అన్ని రకాలుగా అండదండలు అందించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కొత్తకొత్త క్రీడలపై కూడా కసరత్తు చేయాలి
మన భారత అథ్లెట్లు క్రికెట్, హాకీలే కాదు కొత్తకొత్త క్రీడలపై కూడా కసరత్తు చేయాలని ప్రధాని సూచించారు. గ్రామీణ క్రీడ ఖో–ఖోతో పాటు గట్కా, మల్లకంభ, యోగాసన తదితర కొత్త క్రీడల్ని ‘ఖేలో–ఇండియా’లో భాగం చేశామని చెప్పారు. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది.

వేగవంతమైన సెంచరీ
ఈ టీనేజ్‌ కుర్రాడు వైభవ్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో విధ్వంసరచన చేశాడు. కేవలం 35 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీగా నిలిచింది. 30 బంతుల్లో గేల్‌ చేసిన సెంచరీ మొదటి స్థానంలో ఉంది. 

ఇదిలా ఉంటే.. గుజరాత్‌పై సెంచరీ చేసిన తర్వాత వైభవ్‌ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గత రెండు మ్యాచ్‌లలో ఈ కుర్రాడు విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో డకౌట్‌ అయిన వైభవ్‌.. ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే, వైభవ్‌ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉన్నాడని.. తప్పక తన పొరపాట్లను సరిచేసుకుంటాడని పలువురు మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలుస్తున్నారు.

చదవండి: IPL 2025: సన్‌రైజర్స్‌ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్‌

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)