Breaking News

PCB: బాబర్‌పై వేటు.. కెప్టెన్‌గా ఆఫ్రిది.. ఆరుగురికి చోటు

Published on Wed, 03/04/2026 - 19:21

ఊహాగానాలే నిజమయ్యాయి. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో విఫలమైన ‘స్టార్‌’ బ్యాటర్‌ బాబర్‌ ఆజంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) వేటు వేసింది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ నుంచి అతడిని తప్పించింది.

బంగ్లాతో వన్డే సిరీస్‌
కాగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌ మధ్య మార్చి 11- 15 మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పర్యటించే జట్టును పీసీబీ బుధవారం ప్రకటించింది. పేస్‌ బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిదిని కెప్టెన్‌గా కొనసాగించిన యాజమాన్యం.. బాబర్‌ను మాత్రం ఎంపిక చేయలేదు.

ఆరుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చోటు
అంతేకాదు.. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చోటు ఇచ్చారు సెలక్టర్లు. తద్వారా సీనియర్లపై కఠిన చర్యలు తప్పవని.. జట్టు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అబ్దుల్‌ సమద్‌, మాజ్‌ సదాకత్‌, ముహమద్‌ ఘాజి ఘోరి, సాద్‌ మసూద్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, షామిల్‌ హుసేన్‌లకు తొలిసారి వన్డే జట్టులో చోటు ఇచ్చారు.

అందుకే బాబర్‌పై వేటు.. వారికి చోటు
కాగా బాబర్‌ ఆజం ఆట తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ప్రపంచకప్‌ టోర్నీలోనూ అతడు విఫలమయ్యాడు. మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

ఇక గతేడాది వన్డేల్లోనూ బాబర్‌ ఆజం 17 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 544 పరుగులే చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అతడిని పక్కనపెట్టారు. మరోవైపు.. టీ20 జట్టులో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్‌ ఫర్హాన్‌కు మాత్రం సెలక్టర్లు వన్డేక్యాప్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా ఫర్హాన్‌ వరల్డ్‌కప్‌ టోర్నీలో 383 పరుగులతో రాణించాడు.

ఇదిలా ఉంటే.. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు అబ్దుల్‌, మాజ్‌, మసూద్‌, హుసేన్‌ ఇప్పటికే పాకిస్తాన్‌ షాహిన్స్‌ తరఫున సత్తా చాటారు. ఇక సీనియర్‌ ప్లేయర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, పేసర్‌ హ్యారిస్‌ రవూఫ్‌, మొహమ్మద్‌ వసీం జూనియర్‌, ఆల్‌రౌండర్‌ ఫాహిమ్‌ ఆష్రఫ్‌, సల్మాన్‌ ఆఘా, మణికట్టు స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ ఈ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.

బంగ్లాదేశ్‌తో వన్డేలకు పాకిస్తాన్‌ జట్టు
షాహిన్‌ ఆఫ్రిది (కెప్టెన్‌), అబ్దుల్‌ సమద్‌, అబ్రార్‌ అహ్మద్‌, ఫాహిమ్‌ ఆష్రఫ్‌, ఫైజల్‌ అక్రం, హ్యారిస్‌ రవూఫ్‌, హుసేన్‌ తలత్‌, మాజ్‌ సదాకత్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ (వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ వసీం జూనియర్‌, ముహమద్‌ ఘాజి ఘోరి (వికెట్‌ కీపర్‌), సాద్‌ మసూద్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, సల్మాన్‌ ఆఘా, షామిల్‌ హుసేన్‌

షెడ్యూల్‌
మార్చి 11- తొలి వన్డే
మార్చి 13- రెండోవన్డే
మార్చి 15- మూడో వన్డే
వేదిక: షేరే బంగ్లా నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, ఢాకా.

చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)