Breaking News

వివాదంలో ఎంబాపె.. ‘క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడుస్తా!’

Published on Tue, 07/07/2026 - 19:58

ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తరఫున అదరగొడుతున్న ఎంబాపె.. పరాగ్వేతో మ్యాచ్ అనంతరం ఆ దేశానికి చెందిన మహిళా సెనెటర్ సెలెస్టే అమరిల్లాను ఉద్దేశించి ‘నీచమైన మహిళ’ అని ఉద్దేశిస్తూ ఎంబాపె తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు పెట్టడం అగ్గిని రాజేసింది. 

ఎంబాపె తనకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని సెలెస్టే డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఎంబాపె చేసిన వ్యాఖ్యలు జాతి వివక్షపూరితంగా ఉన్నాయని, అతడు క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని హెచ్చరించడం ఇక్కడ కొసమెరుపు.

అసలేం జరిగిందంటే?
ఫిఫాలో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌, పరాగ్వే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో పరాగ్వేను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ పూర్తయ్యాక ఎంబాపే ‘ఎక్స్‌’లో సెలిస్టే అమరిల్లాను నీచమైన మహిళగా పేర్కొంటూ పోస్ట్ పెట్టాడు. ‘మేడం సెలెస్టీ.. మీరు ఒక నీచమైన మహిళ. సెనేటర్‌ పదవికి మీరు అనర్హులు. మీరు పరాగ్వే ప్రతినిధులు కారు. 

ఫిఫా వరల్డ్‌కప్‌లో పరాగ్వే జట్టు అద్భుత ప్రదర్శనతో మీ నిర్లక్ష్య ధోరణిని, మీరు చూపిన జాతి వివక్షను అందరూ మరిచిపోయారు. మీరు అశక్తులు. దేశ ప్రతినిధిగా మిమ్మల్ని చూపడానికి అనర్హులు. విద్వేషాన్ని, జాతివివక్షను ప్రపంచమంతా వ్యాపింప జేయాలనుకునే ఆమెలాంటి వాళ్లను నేను అనుమతించను’ అని ఎంబాపె సంచలన పోస్టు పెట్టాడు.

ఎంబాపె పెట్టిన పోస్ట్‌ చూసి సెలెస్టీ కోపంతో ఉగిపోయింది. తనను నీచమైన మహిళ అనేందుకు, సెనెటర్ పదవికి అనర్హురాలు అనడానికి ఎంబాపెకు అర్హత లేదని మండిపడ్డారు. ‘సమస్య నీకు, నాకు మధ్య. ఫ్రాన్స్‌ను ఉద్దేశించి నేను ఏమీ అనలేదు. నేను ఫ్రాన్స్‌లోని స్కూల్లో చదివాను. పదిహేడేళ్లు వచ్చేవరకూ ఇక్కడే చదివా. ఫ్రెంచ్ మాట్లాడుతా. ఫ్రాన్స్‌ రావడం అంటే నాకు ఇష్టం. 

నాకు ఫ్రాన్స్‌తో ఏ సమస్యా లేదు. నీతోనే సమస్య. మ్యాచ్ అనంతరం ఎంబాపే తన కోపాన్ని, ధిక్కార స్వభావాన్ని చూపాడు. పరాగ్వే ఆటగాళ్లు, గోల్ కీపర్ పట్ల అతడు ప్రవర్తించిన తీరు నా దేశాన్ని గాయపరిచింది. కాబట్టి ఎంబాపే తన పోస్ట్ పట్ల బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేదంటే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని సెలెస్టీ పేర్కొంది. 

గోల్డెన్‌ బూట్‌ రేసులో ఎంబాపె

ఇక ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన ఎంబాపె ఏడు గోల్స్, రెండు అసిస్ట్‌ల‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్నాడు. ఎంబాపెకు పోటీగా అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ కూడా ఉన్నాడు. మెస్సీ 4 మ్యాచ్‌ల్లోనే ఏడు గోల్స్‌ చేయడం విశేషం. నేడు జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్‌తో అర్జెంటీనా తలపడనున్న నేపథ్యంలో మెస్సీ ఎన్ని గోల్స్‌ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)