Breaking News

బుమ్రాను భయపెడుతున్న పాకిస్తాన్‌ బౌలర్‌

Published on Wed, 10/22/2025 - 16:18

టీమిండియా స్టార్‌ బౌలర్‌, పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాను (Jasprit Bumrah) పాకిస్తాన్‌ వెటరన్‌ స్పిన్నర్‌ నౌమన్‌ అలీ (Noman Ali) భయపెడుతున్నాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నౌమన్‌ బుమ్రాకు అతి సమీపంగా వచ్చాడు. 

గత వారం​ అద్భుత ప్రదర్శన కారణంగా నౌమన్‌ ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకాడు. టాప్‌ ర్యాంక్‌లో ఉన్న బుమ్రాకు నౌమన్‌కు కేవలం 29 రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసం​ మాత్రమే ఉంది.

గత వారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో నౌమన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు సహా 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

39 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ అయిన నౌమన్‌ గత కొంతకాలంగా టెస్ట్‌ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. చివరి 5 టెస్ట్‌ల్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కెరీర్‌లో 21 టెస్ట్‌లు ఆడిన నౌమన్‌ 95 వికెట్లు తీశాడు.

బుమ్రా విషయానికొస్తే.. ఇతను ఈ నెలలో వెస్టిండీస్‌తో ఆడిన రెండు టెస్ట్‌ల్లో పెద్దగా వికెట్లు తీయలేకపోయాడు. తొలి టెస్ట్‌లో 3, రెండో టెస్ట్‌లో 4 వికెట్లు మాత్రమే తీశాడు.

ఈ వారం​ ర్యాంకింగ్స్‌లో నౌమన్‌తో పాటు మరో బౌలర్‌ భారీగా లబ్ది పొందాడు. సౌతాఫ్రికాకు చెందిన సెనూరన్‌ ముత్తుసామి పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఏకంగా 38 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతను 55 స్థానంలో ఉన్నాడు. ఈ రెండు భారీ మార్పులు మినహా ఈ వార​ం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. భారత బౌలర్లు సిరాజ్‌, కుల్దీప్‌, జడేజా 12, 14, 18 స్థానాల్లో కొనసాగుతున్నారు.

టెస్ట్‌ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. రూట్‌, బ్రూక్‌, కేన్‌ టాప్‌-3లో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాళ్లు జైస్వాల్‌, పంత్‌, గిల్‌ 5, 8, 12 స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.​

చదవండి: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ స్పిన్నర్‌.. 92 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)