Breaking News

పాకిస్తాన్‌, సౌతాఫ్రికా తొలి వన్డేలో హైడ్రామా

Published on Wed, 11/05/2025 - 07:25

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌, సౌతాఫ్రికా (Pakistan vs South Africa) జట్ల మధ్య నిన్న (నవంబర్‌ 4) జరిగిన తొలి వన్డేలో హైడ్రామా చోటు చేసుకుంది. పాక్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ (Abrar Ahmed) హ్యాట్రిక్‌ సాధించినట్టే సాధించి మిస్‌ అయ్యాడు. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 44వ ఓవర్‌ తొలి రెండు బంతులకు అబ్రార్‌.. బ్రీట్జ్కే, ఫోర్టుయిన్‌ను ఔట్‌ చేశాడు. మూడో బంతికి లుంగి ఎంగిడి ఎల్బీడబ్ల్యూ అయినట్లు తొలుత ఫీల్డ్‌ అంపైర్‌ ప్రకటించాడు.

దీంతో అబ్రార్‌, అతని సహచరులు సహా మైదానంలో ఉన్న పాక్‌ అభిమానులంతా తెగ సంబరపడిపోయారు. అయితే ఎంగిడి అంపైర్‌ నిర్ణయంపై రివ్యూకి వెళ్లడంతో కథ తారుమారైంది. రివ్యూలో స్పష్టంగా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ ఉన్నట్లు తేలింది. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. చేతిలోకి వచ్చిన హ్యాట్రిక్‌ మిస్‌ కావడంతో అబ్రార్‌ తీవ్ర నిరాశకు గురయ్యాడు.

ఈ మ్యాచ్‌లో పాక్‌ సౌతాఫ్రికాను ఓడించి సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్‌ కాగా.. పాక్‌ 8 వికెట్లు కోల్పోయి, మరో 2 బంతులు మిగిలుండగా అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. 

పాక్‌ గెలుపులో సల్మాన్‌ అఘా (62), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (55), ఫకర్‌ జమాన్‌ (45), సైమ్‌ అయూబ్‌ (39, 2 వికెట్లు) కీలక పాత్రలు పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లు పాక్‌ను భయపెట్టారు. ఎంగిడి, ఫెరియెరా, కార్బిన్‌ బాష్‌ తలో 2, లిండే, ఫోర్టుయిన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు నసీం షా (9.1-1-40-3), అబ్రార్‌ అహ్మద్‌ (9-1-53-3), సైమ్‌ అయూబ్‌ (8-0-39-2), షాహీన్‌ అఫ్రిది (10-0-55-1), మొహమ్మద్‌ నవాజ్‌ (10-0-45-1) ధాటికి సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్లు ప్రిటోరియస్‌ (57), డికాక్‌ (63) అర్ద సెంచరీలతో రాణించారు. 

కెప్టెన్‌ బ్రీట్జ్కే (42), కార్బిన్‌ బాష్‌ (41) పర్వాలేదనిపించారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే కూడా ఫైసలాబాద్‌ వేదికగానే నవంబర్‌ 6న జరుగుతుంది. 

చదవండి: ఆసియాక‌ప్‌లో ఓవ‌రాక్ష‌న్‌.. పాక్ ఆట‌గాడిపై 2 మ్యాచ్‌ల బ్యాన్‌! సూర్యకు కూడా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)