Breaking News

హ్యారీ బ్రూక్‌ సెంచరీ.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్‌

Published on Wed, 10/09/2024 - 16:51

ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్‌ 118 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో బ్రూక్‌కు ఇది ఆరో సెంచరీ. పాక్‌పై కేవలం ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగవది. ‌

బ్రూక్‌తో పాటు మరో ఎండ్‌లో జో రూట్‌ కూడా సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరు సెంచరీల మోత మోగించడంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు  ఇంగ్లండ్‌ ధీటుగా జవాబిస్తుంది. 85.2 ఓవర్ల అనంతరం​ ఇంగ్లండ్‌ స్కోర్‌ 427/3గా ఉంది. రూట్‌ 146, బ్రూక్‌ 108 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (78), బెన్‌ డకెట్‌ (84) కూడా అర్ద సెంచరీలతో మెరిశారు. అంతకుముందు పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది.

పాక్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ (102), షాన్‌ మసూద్‌ (151), అఘా సల్మాన్‌ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్‌ షకీల్‌ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్‌ అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో రెండు.. క్రిస్‌ వోక్స్‌, షోయబ్‌ బషీర్‌, జో రూట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

చదవండి: జో రూట్‌ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)