Breaking News

PAK VS ENG 1st Test: జమాల్‌ 'కమాల్‌' క్యాచ్‌

Published on Tue, 10/08/2024 - 18:14

మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాక్‌ ఆటగాడు ఆమెర్‌ జమాల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్నాడు. నసీం​ షా బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఓలీ పోప్‌ ఆడిన పుల్‌ షాట్‌ను జమాల్‌ 'కమాల్‌'​ క్యాచ్‌గా మలిచాడు. మిడ్‌ వికెట్‌ దిశగా ఫీల్డింగ్‌ చేస్తున్న జమాల్‌ ఒంటి చేత్తో సూపర్‌ మ్యాన్‌లా క్యాచ్‌ అందుకున్నాడు. జమాల్‌ కమాల్‌ విన్యాసాన్ని చూసి ఓలీ పోప్‌కు ఫ్యూజులు ఔటయ్యాయి. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ భారీ స్కోర్‌ చేసింది. అబ్దుల్లా షఫీక్‌ (102), షాన్‌ మసూద్‌ (151), అఘా సల్మాన్‌ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్‌ అయూబ్‌ 4, బాబర్‌ ఆజమ్‌ 30, నసీం షా 33, మొమహ్మద్‌ రిజ్వాన్‌ 0, ఆమెర్‌ జమాల్‌ 7, షాహీన్‌ అఫ్రిది 26, అబ్రార్‌ అహ్మద్‌ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్‌ అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో రెండు.. క్రిస్‌ వోక్స్‌, షోయబ్‌ బషీర్‌, జో రూట్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఆదిలోనే కెప్టెన్‌ ఓలీ పోప్‌ వికెట్‌ను కోల్పోయింది. పోప్‌ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్‌ జమాల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 96/1గా ఉంది. జాక్‌ క్రాలే (64), జో రూట్‌ (32) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది. 

చదవండి: హాంగ్‌కాంగ్‌ సిక్సర్స్‌ టోర్నీలో పాల్గొననున్న టీమిండియా
 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)