Breaking News

అతడు సెలక్ట్‌ అవ్వాలంటే అదొక్కటే మార్గం: మాజీ చీఫ్‌ సెలక్టర్‌

Published on Mon, 01/05/2026 - 16:02

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. గత వన్డే సిరీస్‌ (సౌతాఫ్రికా)తో పోలిస్తే.. ఈసారి ముగ్గురు క్రికెటర్లు తమ స్థానాలు కోల్పోయారు. రిషభ్‌ పంత్‌ ఆట, వన్డేల్లో అతడి సగటు, వైఫల్యాలపై చర్చ జరుగుతున్నా... రెండో వికెట్‌ కీపర్‌గా అతడికే పట్టం కట్టారు సెలక్టర్లు.

అయితే.. మరో వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురేల్‌ (Dhruv Jurel)పై మాత్రం వేటు పడింది. ఇక హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (Tilak Varma) కూడా జట్టులో స్థానం కోల్పోయాడు. తిలక్‌ను విశాఖపట్నంలో మూడో వన్డేకు తుది జట్టులోకి తీసుకున్నా...బ్యాటింగ్‌ రాకపోగా, జురేల్‌కు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశమే రాలేదు.

శ్రేయస్‌ అయ్యర్‌ పునరాగమనంతో
మరోవైపు.. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీ సాధించినా రుతురాజ్‌ గైక్వాడ్‌పై కూడా వేటు పడింది. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లోనూ దుమ్ములేపుతున్నా అతడికి నిరాశే మిగిలింది. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ పునరాగమనంతో రుతురాజ్‌ స్థానం కోల్పోక తప్పలేదు.

అయితే, రుతు విషయంలో సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్‌, టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ విమర్శించాడు. ‘‘జట్టులో స్థానం కోసం రుతురాజ్‌ తనలోని మరో నైపుణ్యం గురించి సెలక్టర్లకు చెప్పాలేమో!.. ‘నేను ధోనితో కలిసి ఆడాను.. వికెట్‌ కీపింగ్‌ కూడా చేయగలను’ అని చెప్పాలి.

అదొక్కటే మార్గం
జట్టులోకి తిరిగి వచ్చేందుకు అతడికి అదొక్కటే మార్గం. శ్రేయస్‌ అయ్యర్‌ కచ్చితంగా జట్టులో ఉండాలి. అదే సమయంలో పదిహేను మంది సభ్యులలో రుతురాజ్‌ కూడా ఉండాలి. నితీశ్‌ కుమార్‌ రెడ్డికి బదులు అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది.

నువ్వు సెంచరీ చేశావని తెలిసినా రుతు వంటి ఆటగాళ్లకు చోటు ఇవ్వమని చెప్పడం సరికాదు. దేశీ క్రికెట్‌లో మళ్లీ సత్తా చాటి అతడు తనను తాను నిరూపించుకోవాల్సిందే’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 11, 14, 18 తేదీల్లో వరుసగా వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లలో వన్డేలు జరుగుతాయి.  

న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, కుల్దీప్‌ యాదవ్, హర్షిత్‌ రాణా, మొహమ్మద్‌ సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌.      

చదవండి: BCCI: శుబ్‌మన్‌ గిల్‌ డిమాండ్‌ ఇదే!

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)