Breaking News

IPL 2026: కెప్టెన్‌ పేరును ప్రకటించిన సీఎస్‌కే

Published on Sat, 11/15/2025 - 20:35

ఐపీఎల్‌-2026 మినీ వేలానికి (IPL 2026 Auction) ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడేళ్లుగా తమతో ఉన్న రవీంద్ర జడేజాను రాజస్తాన్‌ రాయల్స్‌కు ట్రేడ్‌ చేసింది. జడ్డూకు బదులుగా రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)ను జట్టులోకి చేర్చుకుంది.

ఏకంగా రూ. 18 కోట్లు
సంజూ కోసం సీఎస్‌కే ఏకంగా రూ. 18 కోట్లు చెల్లించగా.. రాయల్స్‌ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడేజాతో పాటు సామ్‌ కర్రాన్‌ను సీఎస్‌కే నుంచి ట్రేడ్‌ చేసుకుంది. ఇక కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు సీఎస్‌కే ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

కెప్టెన్‌ పేరును ప్రకటించిన సీఎస్‌కే
ఈ నేపథ్యంలోనే సంజూకు సీఎస్‌కే కెప్టెన్సీ అప్పగిస్తారనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలకు సీఎస్‌కే ఫ్రాంఛైజీ స్వయంగా తెరదించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌నే తమ కెప్టెన్‌గా కొనసాగిస్తామని శనివారం స్పష్టం చేసింది. ‘‘ముందుకు నడిపించే సారథి.. మా కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది.

వైస్‌ కెప్టెన్‌గా?
అంతేకాదు.. సంజూను వికెట్‌ కీపర్‌గానూ ఉపయోగించుకునేందుకు సీఎస్‌కే సిద్ధంగా లేనట్లే. దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోని ఉండగా.. కీపింగ్‌ సేవలు వేరే ఎవరి చేతికి ఇచ్చేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపదన్నది బహిరంగ రహస్యమే. 

కాబట్టి సంజూ సీఎస్‌కేలో ఓ సాధారణ క్రికెటర్‌గా మాత్రమే ఉంటాడు. అయితే, టాపార్డర్‌లో అతడు కీలక ఆటగాడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రుతుకు డిప్యూటీగా వైస్‌ కెప్టెన్‌గా నియమితుడైనా ఆశ్చర్యం లేదు.

కేవలం నాలుగే గెలిచి
కాగా గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్‌ రాయల్స్‌ సారథిగా ఉన్న సంజూ.. 2022లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇదిలా ఉంటే.. 2024 సీజన్‌లో ధోని నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్‌ కెప్టెన్‌గా ఇంత వరకు తనదైన ముద్ర వేయలేదు. తాజా ఎడిషన్‌లో గాయం కారణంగా అతడు మధ్యలోనే నిష్క్రమించగా.. మళ్లీ ధోనినే జట్టును ముందుకు నడిపించాడు.

అయితే, ఈసారి సీఎస్‌కే ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివరన పదోస్థానంలో నిలిచింది. అందుకే ఐపీఎల్‌-2026కు ముందే చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్న సీఎస్‌కే.. వేలంలో మెరికల్లాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలనే వ్యూహంతో ఉంది. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)
రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్‌, ఎంఎస్‌ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్‌), శివమ్ దూబే, జామీ ఓవర్‌టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్‌ చౌదరి.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ విడిచిపెట్టిన ఆటగాళ్లు
మతీశ పతిరణ, డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర, రాహుల్‌ త్రిపాఠి, విజయ్‌ శంకర్‌, దీపక్‌ హుడా, వన్ష్‌ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్‌, షేక్‌ రషీద్‌, కమ్లేశ్‌ నాగర్‌కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్‌), సామ్‌ కర్రాన్‌ (ట్రేడింగ్‌).

చదవండి: వెంకటేశ్‌ అయ్యర్‌కు భారీ షాక్‌.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)