Breaking News

T20 WC: ఇంగ్లండ్‌, పాక్‌ కాదు! టైటిల్‌ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా

Published on Fri, 05/17/2024 - 15:28

ఐపీఎల్‌-2024 ముగిసిన వారం రోజుల్లోపే మరో మెగా ఈవెంట్‌ క్రికెట్‌ ప్రేమికుల ముందుకు రానుంది. టీ20 ప్రపంచకప్‌-2024 రూపంలో మరోసారి పొట్టి ఫార్మాట్‌ మజాను అందించనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌ సహా మిగిలిన ప్రధాన దేశాల క్రికెట్‌ బోర్డులు జట్లను ప్రకటించాయి.

అప్పుడు సెమీస్‌లోనే
జూన్‌ 1 నుంచి ఆరంభం కానున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు అమెరికాతో కలిసి వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తంగా 20 జట్లు పాల్గొననున్న ఈ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు రోహిత్‌ శర్మనే సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే ఎనిమిదిసార్లు పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్‌ రెండో దఫా కెప్టెన్‌ హోదాలో బరిలోకి దిగనున్నాడు.

గత ప్రపంచకప్‌-2022లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ సేన ‌సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ మధ్య ఫైనల్‌ జరుగగా ఇంగ్లిష్‌ జట్టు విజేతగా అవతరించింది. ఇక ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

టైటిల్‌ రేసులో నిలిచే జట్లు ఇవే
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2024లో గట్టి పోటీనిచ్చే, టైటిల్‌ రేసులో నిలిచే జట్లు ఇవేనంటూ తన అంచనా తెలియజేశాడు.

‘‘ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌.. అలాగే ఆతిథ్య  వెస్టిండీస్‌.. ఈ నాలుగు జట్లే మెగా ఈవెంట్లో కీలకంగా మారనున్నాయి’’ అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో జై షా పేర్కొన్నాడు. అయితే, ఈ లిస్టులో ఆయన డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌, గత ఎడిషన్‌ రన్నరప్‌ పాకిస్తాన్‌ పేర్లను విస్మరించడం గమనార్హం.

కాగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్‌ గ్రూపు-ఏలో ఉన్నాయి. ఈ రెండు జట్లతో పాటు కెనడా, ఐర్లాండ్‌, యూఎస్‌ఏ కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి. ఇక జూన్‌ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత జూన్‌ 9న పాకిస్తాన్‌తో తలపడనుంది.

టీ20 ప్రపంచకప్‌-2024- ఏ గ్రూపులో ఏ జట్టు?
👉గ్రూప్‌-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్‌, పాకిస్తాన్‌(ఏ2), యూఎస్‌ఏ
👉గ్రూప్‌-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్‌(బీ1), నమీబియా, ఒమన్‌, స్కాట్లాండ్‌.
👉గ్రూప్‌-సి: అఫ్గనిస్తాన్‌, న్యూజిలాండ్‌(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్‌ ఇండీస్‌(సీ2).
👉గ్రూప్‌-డి: బంగ్లాదేశ్‌, నేపాల్‌, నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2). 

చదవండి: RCB vs CSK: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరదు! అదెలా?.. మధ్యలో లక్నో!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)