Breaking News

ఓవరాక్షన్‌ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్‌ను ఉతికారేసిన పూరన్‌! వీడియో వైరల్‌

Published on Mon, 08/14/2023 - 12:07

టీమిండియాపై టెస్టు, వన్డే సిరీస్‌ల ఓటమికి వెస్టిండీస్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఫ్లోరిడా వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్‌ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కరేబియన్‌ జట్టు కైవసం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్‌పై విండీస్‌కు ఇదే తొలి టీ20 సిరీస్‌ విజయం కావడం గమానార్హం. విండీస్‌ విజయంలో పేసర్‌ షెఫార్డ్‌, బ్యాటర్లు కింగ్‌, పూరన్‌ కీలక పాత్ర పోషించారు.

హార్దిక్‌కు చుక్కలు చూపించిన పూరన్‌..
ఇక టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై విండీస్‌ విధ్వంసకర ఆటగాడు నికోలస్‌ పూరన్‌ బదులు తీర్చుకున్నాడు. నాలుగో టీ20కు ముందు హార్దిక్‌ పాండ్యా.. పూరన్‌కు ఓ సవాలు విసిరాడు. "పూరన్‌ కొడితే నా బౌలింగ్‌లోనే కొట్టాలి. మా ప్లాన్స్‌ మాకు ఉన్నాయి. నాకు ఇటువంటి పోటీ అంటే చాలా ఇష్టం. నా మాటలు పూరన్‌ విని నాలుగో టీ20లో నన్ను టార్గెట్‌ చేస్తాడని" మూడో టీ20 అనంతరం హార్దిక్‌ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో నాలుగో టీ20లో పూరన్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో హార్దిక్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనే ఛాన్స్‌ పూరన్‌కు రాలేదు. కానీ నిర్ణయాత్మక ఐదో టీ20లో మాత్రం హార్దిక్‌ బౌలింగ్‌ ఆడే అవకాశం నిక్కీకి వచ్చింది. ఈ క్రమంలో హార్దిక్‌కు పూరన్‌ చుక్కలు చూపించి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. పూరన్‌ వచ్చిరాగానే మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

అందులో రెండు సిక్సర్లు హార్దిక్‌ ఓవర్‌లో  కొట్టినివే. విండీస్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన హార్దిక్‌ బౌలింగ్‌లో ఆఖరి రెండు బంతులను పూరన్‌ సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 18 బంతులు ఆడి 14 పరుగులు చేసిన పాండ్యా.. అనంతరం బౌలింగ్‌లో అయితే  ఘోరప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లు వేసి 32 పరుగులు సమర్పించుకున్నాడు.
చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్‌ వాళ్లకే! అతడు హీరో: విండీస్‌ కెప్టెన్‌

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)