Breaking News

వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్‌

Published on Mon, 11/10/2025 - 19:40

న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 10) జరగాల్సిన నాలుగో టీ20 వర్షార్పణమైంది. నెల్సన్‌లోని సాక్స్ట్‌న్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా.. 6.3 ఓవర్ల తర్వాత మ్యాచ​్‌ వర్షం కారణంగా నిలిచిపోయింది.

వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆ సమయానికి విండీస్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 38 పరుగులుగా ఉంది. అలిక్‌ అథనాజ్‌ (21) ఔట్‌ కాగా.. ఆమిర్‌ జాంగూ (12), కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. అథనాజ్‌ వికెట్‌ నీషమ్‌కు దక్కింది.

ఆధిక్యంలో న్యూజిలాండ్‌
ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. మొదటి మ్యాచ్‌లో విండీస్‌ గెలువగా.. న్యూజిలాండ్‌ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్‌ వేదికగా నవంబర్‌ 13న జరుగనుంది.

కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌ తర్వాత వన్డే సిరీస్‌, ఆతర్వాత టెస్ట్‌ సిరీస్‌ జరుగుతాయి. నవంబర్‌ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. డిసెంబర్‌ 2, 10, 18 తేదీల్లో టెస్ట్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. 

చదవండి: ఐదేసిన ములానీ.. మావి ఆల్‌రౌండ్‌ షో

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)