IND vs NZ: న్యూజిలాండ్‌ జట్టులో కీలక మార్పులు

Published on Tue, 01/27/2026 - 10:54

టీమిండియాతో టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌ హ్యాట్రిక్‌ విజయాలతో 3-0తో కివీస్‌ను చిత్తు చేసింది. ఫలితంగా మిగిలిన రెండు మ్యాచ్‌లలోనైనా గెలుపొంది పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు తమకు మిగిలిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కివీస్‌ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో మిగిలిన రెండు టీ20లకు సంబంధించి తమ జట్టులో కీలక మార్పులు చేసింది.

ఆ ఇద్దరిపై వేటు
యువ ఫాస్ట్‌ బౌలర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌తో పాటు టాపార్డర్‌ బ్యాటర్‌ టిమ్‌ రాబిన్సన్‌లను జట్టు నుంచి తొలగించిన కివీస్‌. వారి స్థానాల్లో జేమ్స్‌ నీషమ్‌, లాకీ ఫెర్గూసన్‌లను జట్టులోకి తీసుకువచ్చింది. 

అదే విధంగా టిమ్‌ సీఫర్ట్‌ కూడా జట్టుతో చేరినట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ఇక ఐదో టీ20 కోసం టాపార్డర్‌ బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌ కూడా జట్టుతో చేరతాడని బ్లాక్‌క్యాప్స్‌ తెలిపింది.

కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ 2-1తో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించిన కివీస్‌.. టీ20 సిరీస్‌లో మాత్రం వరుస వైఫల్యాలతో ఓటమిపాలైంది. ఇక భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య బుధవారం నాలుగో టీ20, శనివారం ఐదో టీ20 జరుగనున్నాయి. ఇందుకు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలు.

భారత్‌తో మిగిలిన రెండు టీ20లకు న్యూజిలాండ్‌ జట్టు (అప్‌డేటెడ్‌)
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్‌), డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌ కీపర్‌), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జేకబ్ డఫీ, జేమ్స్ నీషమ్, కైల్ జెమీసన్, మైకేల్ బ్రేస్‌వెల్, బెవాన్ జేకబ్స్, ఫిన్ అలెన్ (5వ టీ20కి మాత్రమే).

చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్‌ అవుట్‌.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్‌!

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)