వికెట్ తేడాతో సంచ‌ల‌న విజ‌యం.. కివీస్‌దే వ‌న్డే సిరీస్‌

Published on Mon, 07/20/2026 - 20:32

వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 3-1 తేడాతో కైవ‌సం చేసుకుంది. ఆదివారం రాత్రి జ‌రిగిన నాలుగో వ‌న్డేలో న్యూజిలాండ్ వికెట్ తేడాతో వెస్టిండీస్‌పై సంచ‌ల‌నం విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44.4 ఓవ‌ర్ల‌లో 188 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

విండీస్ బ్యాట‌ర్ల‌లో అమిర్ జాంగో (51) అర్ధ‌సెంచ‌రీ సాధించ‌గా, ఆఖ‌ర్లో గుద‌కేశ్ మోతీ (41) రాణించాడు. ఒక ద‌శ‌లో 81 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతూ క‌ష్టాల్లో ప‌డిన విండీస్‌ను గుద‌కేశ్‌, అమిర్ జాంగో ఆదుకున్నారు. ఈ ఇద్ద‌రు ఏడో వికెట్‌కు 81 ప‌రుగులు జోడించ‌డంతో వెస్టిండీస్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును సాధించింది. 

న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాథ్యూ ఫిష‌ర్ మూడు వికెట్లు తీయ‌గా, మిచెల్ సాంట్న‌ర్‌, మైకెల్ బ్రాస్‌వెల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో న్యూజిలాండ్ కూడా త‌డ‌బ‌డింది. 88 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో మార్క్ చాప్‌మ‌న్ (80), మైకెల్‌బ్రాస్‌వెల్ (32), మిచెల్‌సాంట్న‌ర్ (34 నాటౌట్‌) విలువైన భాగ‌స్వామ్యాలు నిర్మించారు. 

చాప్‌మ‌న్‌, బ్రాస్‌వెల్ వెనుదిరిగిన‌ప్ప‌టికీ క‌డ‌దాకా నిలిచిన కెప్టెన్ సాంట్న‌ర్ మరో 35 బంతులు మిగిలి ఉండగానే (44.5 ఓవర్లలో) జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. విండీస్ బౌల‌ర్ల‌లో గుద‌కేశ్ మోతీ 5 వికెట్ల‌తో స‌త్తా చాట‌గా, మాథ్యూ ఫోర్డ్ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన మిచెల్ సాంట్న‌ర్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు గెలుచుకున్నాడు. ఇరుజ‌ట్ల మ‌ధ్య నామ‌మాత్ర‌మైన చివ‌రి వ‌న్డే రేపు జ‌ర‌గ‌నుంది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)