Breaking News

డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్‌.. పుజారా, ఉమేశ్‌ యాదవ్‌లపై వేటు..?

Published on Mon, 06/12/2023 - 19:35

వరుసగా రెండో సీజన్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాం‍పియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్యల్లో భాగంగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనలు చేస్తున్న ఆటగాళ్లపై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. త్వరలో ప్రారంభంకాబోయే విండీస్‌ టూర్‌ కోసం టీమిండియాలో సమూల మార్పుల చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్‌ పుజారా, ఉమేశ్‌ యాదవ్‌లపై వేటుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. వీరి స్థానంలో యశస్వి జైస్వాల్‌, ముకేశ్‌ కుమార్‌లను ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ పలు మార్పులకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2023 ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు ఉండవచ్చని సమాచారం.

టీ20ల్లో రింకూ సింగ్‌, యశస్వి జైస్వాల్‌, జితేశ్‌ శర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబే, మోహిత్‌ శర్మలకు దాదాపుగా ఛాన్స్‌ దక్కవచ్చని తెలుస్తోంది. విండీస్‌ టూర్‌లో సీనియర్ల గైర్హాజరీలో వీరికి వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని బోర్డు యోచిస్తున్నట్లు వినికిడి. ఇదే విండీస్‌ టూర్‌లో వన్డేల కోసం పలువురు ఆటగాళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేయవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో శిఖర్‌ ధవన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ధవన్‌కు వయసు పైబడుతుండటంతో వరల్డ్‌కప్‌కు ముందు వీలైనన్ని అవకాశాలు కల్పించాలన్నది బీసీసీఐ యోచనగా తెలుస్తోంది. 

కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ కోసం భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌ తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత వన్డేలు, టీ20లు ఆడుతుంది.

విండీస్‌ పర్యటన  వివరాలు..

తొలి టెస్ట్‌- జులై 12-16, డొమినికా
రెండో టెస్ట్‌- జులై  20-24, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌

జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్‌
జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్‌
ఆగస్ట్‌ 1- మూడో వన్డే, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌

ఆగస్ట్‌ 4- తొలి టీ20, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
ఆగస్ట్‌ 6- రెండో టీ20, గయానా
ఆగస్ట్‌ 8- మూడో టీ20, గయానా
ఆగస్ట్‌ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా
ఆగస్ట్‌ 13- ఐదో టీ20, ఫ్లోరిడా

చదవండి: WTC Final 2023: ఆల్‌ ఫార్మాట్‌ సూపర్‌ స్టార్స్‌గా ఈ ఐదుగురు క్రికెటర్లు

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)