Breaking News

Namibia: చిన్న జట్టే అయినా ఇరగదీసింది.. ఆస్ట్రేలియాకు సైతం సాధ్యం కాలేదు..!

Published on Tue, 02/27/2024 - 16:21

అంతర్జాతీయ టీ20ల్లో పసికూన నమీబియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. పొట్టి ఫార్మాట్‌లో ఈ జట్టు వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తాజాగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు సైతం సాధ్యంకాని తొమ్మిది వరస విజయాల రికార్డును సాధించింది. తద్వారా ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 18వ జట్టుగా రికార్డుల్లోకెక్కింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాల రికార్డు మలేసియా పేరిట ఉంది. ఈ జట్టు జూన్‌ 2022-డిసెంబర్‌ 2022 మధ్యలో వరుసగా 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. 

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్లు..

  1. మలేసియా (13 వరుస విజయాలు)
  2. బెర్ముడా (13)
  3. ఆఫ్ఘనిస్తాన్‌ (12)
  4. రొమేనియా (12)
  5. ఇండియా (12)
  6. ఆఫ్ఘనిస్తాన్‌ (11)
  7. ఉగాండ (11)
  8. పపువా న్యూ గినియా (11)
  9. నైజీరియా (11)
  10. జెర్సీ (10)
  11. టాంజానియా (10)
  12. ఉగాండ (10)
  13. ఉగాండ (10)
  14. పాకిస్తాన్‌ (10)
  15. న్యూజిలాండ్‌ (10)
  16. పోర్చుగల్‌ (9)
  17. సౌదీ అరేబియా (9)
  18. నమీబియా (9*) 

కాగా, ట్రై సిరీస్‌లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‌లో నమీబియా 20 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా.. లాఫ్టీ ఈటన్‌ (36 బంతుల్లో 101; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఫాస్టెస్ట్‌ సెంచరీతో (33 బంతుల్లో) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్స్‌లో ఈటన్‌తో పాటు మలాన్‌ క్రుగెర్‌ (59 నాటౌట్‌) రాణించాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌.. గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే పరిమితమై 20 పరగుల తేడాతో ఓటమిపాలైంది. రూబెన్‌ ట్రంపల్‌మెన్‌ (4/29) నేపాల్‌ను దెబ్బకొట్టాడు. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో రెండో మ్యాచ్‌ రేపు నేపాల్‌-నెదర్లాండ్స్‌ మధ్య జరుగనుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)