ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన

Published on Tue, 09/30/2025 - 09:12

ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నేపాల్‌ (Nepal) రెండు సార్లు టీ20 ఛాంపియన్లైన వెస్టిండీస్‌పై (West Indies) ద్వైపాక్షిక సిరీస్‌ (West Indies vs Nepal) గెలిచింది. ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుపై నేపాల్‌ సిరీస్‌ గెలవడం ఇదే తొలిసారి. 

షార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్‌ 29) రెండో టీ20లో నేపాల్‌ 90 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 

అంతకుముందు తొలి టీ20లోనూ నేపాల్‌ వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో విండీస్‌ను మట్టికరిపించింది.

రెండో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌.. ఓపెనర్‌ ఆసిఫ్‌ షేక్‌ (68 నాటౌట్‌), సందీప్‌ జోరా (63) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో అకీల్‌ హొసేన్‌, కైల్‌ మేయర్స్‌ తలో 2, జెడియా బ్లేడ్స్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మొహమ్మద్‌ ఆదిల్‌ ఆలం (4-0-24-3), కుషాల్‌ భుర్టెల్‌ (2.1-1-16-3), దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (3-0-4-1), లలిత్‌ రాజబంశీ (3-0-13-1) చెలరేగడంతో 17.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 90 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.  

పరుగుల పరంగా ఓ ఐసీసీ అసోసియేట్‌ జట్టుకు (నేపాల్‌) ఫుల్‌ మెంబర్‌ జట్టుపై (వెస్టిండీస్‌) ఇదే అత్యంత భారీ విజయం. వెస్టిండీస్‌ చేసిన 83 పరుగుల స్కోర్‌, ఓ అసోసియేట్‌ జట్టుపై ఓ ఫుల్‌ మెంబర్‌ జట్టుకు రెండో అత్యల్పం. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఇవాళ (సెప్టెంబర్‌ 30) జరుగనుంది.

 చదవండి: ఐదు రోజుల్లో మరోసారి భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ సమరం

 

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)