Breaking News

అతడేమి రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోంది?

Published on Tue, 06/02/2026 - 07:42

మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. ప్ర‌స్తుతం అత్యంత ఫిట్‌గా ఉన్న భార‌త క్రికెట‌ర్ల‌లో ఒక‌డు. ఎంత అలసిపోయినా అదే వేగంతో, పట్టుదలతో బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అది కొత్త సీజ‌న్‌లోని మొద‌టి బంతి అయినా.. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని చివరి రోజైనా స‌రే సిరాజ్‌లో ఏ మాత్రం అలుపు క‌నిపించ‌దు.

2026లో సిరాజ్ ఇప్ప‌టికే విశ్రాంతి లేకుండా దాదాపు 6 లిస్ట్ ఎ మ్యాచ్‌లు, 18 టీ20 మ్యాచ్‌లు,  2 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అంత‌కముందు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో కూడా సిరాజ్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడి మ‌రోసారి త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. ఆ త‌ర్వాత టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026, ఐపీఎల్‌-2026లో కూడా ఈ హైద‌రాబాదీ భాగ‌మ‌య్యాడు.

సిరాజ్‌కు విశ్రాంతి?
ఈ నేప‌థ్యంలో జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్‌కు సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాల‌ని క్రికెట్ నిపుణులు బీసీసీఐని సూచిస్తున్నారు. బుమ్రా తరహాలోనే సిరాజ్ వర్క్‌లోడ్‌ను కూడా మేనేజ్ చేయాల్సిన అవసరముందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో సిరాజ్ ఏకంగా 17 మ్యాచ్‌లు ఆడాడు. సిరాజ్ చివరగా మే 31న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగాడు.

ఇప్పుడు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే.. అఫ్గాన్‌తో టెస్ట్‌లో అతడు ఆడాల్సి ఉంది. 4 నెలల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన ఒక ఫాస్ట్ బౌలర్‌ను 5 రోజుల సుదీర్ఘ టెస్ట్ మ్యాచ్  ఆడమనడం ఎంతవరకు సమంజసం? ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడేమి రోబో కాదు కదా? అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇదే కొనసాగితే అతడు గాయాల బారిన పడే అవకాశముంది. కాబట్టి బీసీసీఐ అతడి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ క్రికెటర్లు సైతం హెచ్చరిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్ నుండి సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చినప్పటికీ,  ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌, శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్ పర్యటనలతో మళ్లీ బిజీ కానున్నాడు.

ముఖ్యంగా శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగే రెడ్ బాల్ సిరీస్‌లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగనున్నాయి. ఈ సిరీస్‌ల సమయానికి సిరాజ్ 100% ఫిట్‌నెస్‌తో ఉండటం ముఖ్యం. కాగా అఫ్గాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు. 

కాబట్టి ఈ మ్యాచ్ కోసం  ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యువ పేసర్లను వాడుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ముల్లాన్‌పూర్ పిచ్ ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. జట్టులో కుల్దీప్ యాదవ్‌, వాషింగ్టన్ సుందర్‌, హర్ష్ దూబే వంటి స్పిన్నర్లు ఉన్నారు.
చదవండి: ఒకే ఓవర్లో  6 సిక్స్‌లు
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)