‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్‌ వార్నింగ్‌!

Published on Sun, 07/12/2026 - 13:54

అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఆగ్రహం ప్రదర్శించాడు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్పే మెస్సీ తొలిసారి కంట్రోల్‌ తప్పాడు. స్విట్జర్లాండ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ సందర్భంగా ‘మర్యాదగా మాట్లాడండి’ అంటూ మ్యాచ్‌ రిఫరీకి మెస్సీ వార్నింగ్‌ ఇవ్వడం ఆసక్తి కలిగించింది.  దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

విషయంలోకి వెళితే.. స్విట్జర్లాండ్ ఫ్రీ కిక్‌కు సిద్ధమవుతున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు డిఫెన్సివ్ వాల్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మెస్సీని నిబంధనల ప్రకారం కొంత వెనక్కి వెళ్లాలని పోర్చుగల్‌ రిఫరీ జోవో పిన్‌హీరో సూచించారు. అయితే రిఫరీ మాట్లాడిన తీరు నచ్చకపోవడంతో మెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. 

‘నాతో మర్యాదగా మాట్లాడండి. నన్ను అగౌరవపరచొద్దు. నేను మీతో గౌరవంగా మాట్లాడాను.. మీరు కూడా అలాగే మాట్లాడండి’ అంటూ మెస్సీ రిఫరీకి చెబుతున్నట్లు మైక్‌లో రికార్డయ్యాయి. ఈ ఫిఫాలో ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క గోల్‌ అయినా కొట్టిన మెస్సీ స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో  మాత్రం గోల్‌ సాధించలేదు. అయితే ఒక అసిస్ట్‌తో మెస్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే స్విట్జర్లాండ్‌పై విజయంతో అర్జెంటీనా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం ఉద‌యం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జ‌ర్లాండ్‌పై విజ‌యం సాధించింది. ఆట అద‌న‌పు స‌మ‌యంలో రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా స్విట్జ‌ర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. అర్జెంటీనా త‌ర‌ఫున అలెక్సిస్ మాక్ అలిస్ట‌ర్ (10వ నిమిషం), జులియ‌న్ అల్వ‌రెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) అద‌న‌పు స‌మ‌యంలో గోల్ చేశాడు. స్విట్జ‌ర్లాండ్ త‌ర‌ఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. 

 

చదవండి: అర్జెంటీనా దిగ్గ‌జం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన‌

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)