Breaking News

Asia Cup 2023: ఆసియా కప్‌-2023 షెడ్యూల్‌ విడుదల.. ఆరోజే ఫైనల్‌

Published on Wed, 07/19/2023 - 19:30

Mens ODI Asia Cup 2023 Schedule: ఆసియా వన్డే కప్‌-2023 షెడ్యూల్‌ విడుదలైంది. పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్‌ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఈ ఈవెంట్‌ సెప్టెంబరు 17న ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనుంది.

ఆరోజే ఇండియా-పాక్‌ మ్యాచ్‌
పాకిస్తాన్‌లోని ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌- నేపాల్‌ మ్యాచ్‌ మొదలై.. శ్రీలంకలోని కొలంబోలో ఫైనల్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరపడనుంది. ఇక దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా తలపడనున్నాయి. ఇక ఆ తర్వాత టీమిండియా సెప్టెంబరు 4న నేపాల్‌తో అదే వేదికపై మ్యాచ్‌ ఆడనుంది.

గ్రూప్‌-ఏలో నేపాల్‌ కూడా
కాగా ఆసియా వన్డే కప్‌-2023 గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్తాన్‌తో పాటు నేపాల్‌ ఉండగా.. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్‌ దశలో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో రెండు గ్రూపుల నుంచి తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి.

అలా ఫైనల్‌కు
గ్రూప్‌-ఏ టాపర్‌గా నిలిచిన జట్టు, గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెప్టెంబరు 6న సూపర్‌-4లో తొలి మ్యాచ్‌ ఆడుతుంది. సెప్టెంబరు 15న సూపర్‌-4 చివరి మ్యాచ్‌ జరుగుతుంది. ఇందులో టాప్‌-2 జట్లు సెప్టెంబరు 17నాటి ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. 

అందుకే రెండు దేశాల్లో
ఇక ఈ టోర్నీ నిర్వహణ హక్కులు పాకిస్తాన్‌ చేజిక్కించుకోగా.. టీమిండియా పాక్‌ పర్యటనకు సుముఖంగా లేని నేప​థ్యంలో హైబ్రిడ్‌ మోడల్‌ను ఆశ్రయించారు. ఇందులో భాగంగా పాక్‌లోని ముల్తాన్‌లో ఒక మ్యాచ్‌.. లాహోర్‌లో మూడు మ్యాచ్‌లు జరుగనుండగా.. శ్రీలంకలోని క్యాండీలో మూడు, కొలంబోలో 6 మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. కాగా గతేడాది జరిగిన ఆసియా టీ20 టోర్నీ ఫైనల్లో పాక్‌ను ఓడించి శ్రీలంక విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.

చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)