Breaking News

ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు

Published on Sun, 04/19/2026 - 21:06

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, వన్‌డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేయగా, కూపర్ 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మార్కరమ్‌కు ఈ ఇద్దరు పీడకలను మిగిల్చారు. 

13వ ఓవర్ స్ట్రైకింగ్ తీసుకున్న కూపర్ కన్నోలి మార్కరమ్‌ మొదటి బంతిని సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని ఈసారి లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టిన కన్నోలి మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని వైడ్ వేయగా, నాలుగో బంతికి కూపర్ సింగిల్ తీయడంతో ప్రియాన్ష్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక ప్రియాన్ష్ కూడా చివరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టాడు. 

దీంతో ఆ ఓవర్లో మొత్తం 5 సిక్సర్లు, వైడ్ సహా సింగిల్ మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కరమ్ ఒక చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. లక్నో తరఫున ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కరమ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రవి బిష్ణోయ్ పేరిట ఉంది. 2022లో ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇక 2026 సీజ‌న్‌లో ఒకే ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్ కూడా మార్క‌ర‌మ్ మాత్ర‌మే. ఈ సీజ‌న్‌లోనూ ఇదే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఓవ‌ర్ అని చెప్పొచ్చు. 2025 సీజ‌న్‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ (సీఎస్‌కే) ఆర్సీబీతో మ్యాచ్‌లో 33 ప‌రుగులు, మొయిన్ అలీ (కేకేఆర్‌) రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌లో 32 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు.

చదవండి: 'క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం మా కొంప‌ముంచింది’

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)