‘రోహిత్ రిటైర్మెంట్‌ వార్తలపై కోహ్లి రియాక్ష‌న్!’

Published on Fri, 07/17/2026 - 10:27

టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ మ‌రో సీనియ‌ర్ విరాట్ కోహ్లి రియాక్ష‌న్ ఆస‌క్తిగా మారింది. లార్డ్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే రోహిత్‌కు ఆఖ‌రిద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా జ‌ట్టు నుంచి రోహిత్‌ను తొల‌గిస్తున్నట్లు బీసీసీఐ ముందే హిట్‌మాన్‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. 

మ‌రి రోహిత్ నిజంగానే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఈడ్కోలు ప‌లుకుతాడా? లేదా అన్న‌ది ఇంగ్లండ్‌తో జ‌రిగే మూడో వ‌న్డే ద్వారా తేలిపోనుంది. ఇదిలా ఉంటే రోహిత్ శ‌ర్మ రిటైర్ అవ్వ‌నున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌తో ఊగిపోతుంది. ఈ నేప‌థ్యంలోనే ఇంగ్లండ్‌తో రెండో వ‌న్డే సంద‌ర్భంగా రోహిత్‌, కోహ్లి, బుమ్రాలు ప‌క్క‌ప‌క్క‌నే కూర్చొని మ్యాచ్‌ను సీరియ‌స్‌గా వీక్షించిన వీడియో ఒక‌టి బ‌య‌టికొచ్చింది. 

అయితే కోహ్లి, రోహిత్ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చోవ‌డం చాలా అరుదు. దీంతో వీడియోను లింక్ చేస్తూ ఒక అభిమాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 'డ్రెసింగ్ రూమ్‌లో కోహ్లి, రోహిత్‌లు ఇలా ప‌క్క‌ప‌క్క‌న కూర్చోవ‌డం ఎప్పుడూ చూడ‌లేదు. రోహిత్ రిటైర్ అవ్వ‌బోతున్నాడ‌నే వార్త తెలిసిన‌ప్ప‌టి నుంచి కోహ్లి దిగాలుగా కనిపిస్తున్నాడ‌ని, అత‌డి ప‌క్క‌నే కూర్చొని ధైర్యం చెబుతున్న‌ట్లుగా అనిపిస్తోంద‌ని, నిజ‌మైన స్నేహం అంటే ఇదేనంటూ' కామెంట్ చేశాడు.

ఇక రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్‌పై అటు హిట్‌మ్యాచ్ కానీ, ఇటు బీసీసీఐ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొట‌క్ కూడా రోహిత్ ఫామ్‌పై స్పందించాడే త‌ప్ప అత‌డి రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో కొంత‌మంది అభిమానులు వ‌చ్చే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు రోహిత్ ఆడుతాడ‌ని, త‌న ఫిట్‌నెస్‌ను మెరుగుప‌రుచుకునేందుకు రోహిత్ 10 కిలోల బ‌రువు కూడా త‌గ్గాడ‌ని, మూడో వన్డేలో భారీ ఇన్నింగ్స్‌తో మెరుస్తాడ‌ని జోస్యం చెబుతున్నారు. ఇక శుక్ర‌వారం జ‌రిగిన రెండో వ‌న్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

మ్యాచ్ విష‌యానికొస్తే.. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (66 బంతుల్లో 65; 8 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (71 బంతుల్లో 66; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.  అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (133 బంతుల్లో 99 నాటౌట్‌; 9 ఫోర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. 

 

Read: అపశకునం ముద్ర.. ఫైనల్‌కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)