Breaking News

విండీస్‌తో టి20 సిరీస్‌.. కోహ్లి, బుమ్రా ఔట్‌

Published on Thu, 07/14/2022 - 15:50

ఇంగ్లండ్‌ పర్యటన ముగియగానే టీమిండియా వెస్టిండీస్‌ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విండీస్‌ పర్యటనకు సంబంధించి 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే ఫేలవ ప్రదర్శన కనబరుస్తున్న విరాట్‌ కోహ్లిని విండీస్‌తో సిరీస్‌కు పక్కనబెట్టారు. కోహ్లితో పాటు టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే వీరిద్దరిని వర్క్‌లోడ్‌ పేరుతో దూరం పెట్టినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఇక విండీస్‌తో వన్డేలకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక జూలై 22 నుంచి 27 వరకు వన్డే సిరీస్‌ జరుగనుండగా.. విండీస్‌- టీమిండియా మధ్య జూలై 29 నుంచి పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌కు మాత్రం రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాయకత్వం వహించనున్నాడు.

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా తన స్థానాన్ని నిలుపుకోగా.. గాయం నుంచి కోలుకొని కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి జట్టులో చేరగా.. హెర్నియా ఆపరేషన్‌ అనంతరం కేఎల్‌ రాహుల్‌ కూడా సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే వీరిద్దరు ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటూనే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక రవిచంద్రన్‌ తిరిగి టి20 జట్టులో చోటు సంపాదించాడు. 

విండీస్‌తో టి20 సిరీస్‌కు 18 మందితో కూడిన భారత్‌ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, శ్రేయాస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్, రిషబ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్‌ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌

టీమిండియా, విండీస్‌ ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ షెడ్యూల్‌:
తొలి టి20: జూలై 29న
రెండో టి20: ఆగస్టు 1న
మూడో టి20: ఆగస్టు 2న
నాలుగో టి20: ఆగస్టు 6న
ఐదో టి20: ఆగస్టు 7న

చదవండి: ICC ODI WC Super League Standings: టాప్‌లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్‌.. ఏడో స్థానంలో రోహిత్‌ సేన!

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)