Breaking News

న్యూజిలాండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కేన్ మామ వ‌చ్చేశాడు

Published on Mon, 10/20/2025 - 09:10

స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌కు 14 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది.  ఆ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ తిరిగొచ్చాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 త‌ర్వాత విలియ‌మ్స‌న్ గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూరంగా ఉంటున్నాడు.

ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో సెల‌క్ట‌ర్లు అత‌డికి అవ‌కాశ‌మిచ్చారు. అత‌డితో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ నాథ‌న్ స్మిత్ కూడా పున‌రాగ‌మ‌నం చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ జ‌ట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ సాంట్న‌ర్ వ్య‌వ‌హ‌రించాడు. అదేవిధంగా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ టామ్ లాథ‌మ్ గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు.

లాథ‌మ్‌తో పాటు మొహమ్మద్ అబ్బాస్ ఫిన్ అల్లెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విల్ ఓ'రూర్కే , గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ గాయాల కార‌ణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. టీ20ల్లో స‌త్తాచాటుతున్న జాక్ ఫాల్క్స్‌కు కివీస్ సెల‌క్ట‌ర్లు వ‌న్డేల‌కు పిలుపునిచ్చారు.

ప్ర‌స్తుతం కివీస్ జ‌ట్టు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డుతోంది. తొలి టీ20 వ‌ర్ష‌ర్పాణం కాగా.. రెండో టీ20 సోమవారం జ‌ర‌గ‌నుంది.  అక్టోబ‌ర్ 26 నుంచి ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్‌తో వ‌న్డేల‌కు న్యూజిలాండ్ జ‌ట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భార‌త్‌కు సెమీస్ ఛాన్స్‌! ఇలా జరగాల్సిందే?

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)