Breaking News

విలియమ్సన్‌ రీఎంట్రీ.. విండీస్‌తో టెస్టులకు కివీస్‌ జట్టు ఇదే

Published on Tue, 11/25/2025 - 10:43

వెల్లింగ్టన్‌: సీనియర్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) న్యూజిలాండ్‌ టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు జాతీయ కాంట్రాక్టుకు దూరమైన విలియమ్సన్‌... పరిమిత మ్యాచ్‌ల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌లకు దూరమైన కేన్‌... వచ్చే నెల 2 నుంచి వెస్టిండీస్‌ (NZ vs WI Tests)తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు. దీని కోసం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. 

టామ్‌ లాథమ్‌ సారథ్యంలో..
ఇప్పటికే వెస్టిండీస్‌పై టీ20, వన్డే సిరీస్‌లు నెగ్గిన న్యూజిలాండ్‌... సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. టామ్‌ లాథమ్‌ జట్టుకు సారథ్యం వహించనుండగా... కాన్వే, విలియమ్సన్, విల్‌ యంగ్, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్, టామ్‌ బ్లండెల్‌ బ్యాటింగ్‌ భారం మోయనున్నారు. 

ఇక విలియమ్సన్‌ వంటి అనుభవం గల ఆటగాడు జట్టులో ఉండటం ఇతర ఆటగాళ్లకు ఎంతగానో ఉపకరిస్తుందని న్యూజిలాండ్‌ హెడ్‌కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ అన్నాడు. పేస్‌ బౌలర్లు జాక్ ఫౌల్క్స్, జాకబ్‌ డఫీ, బ్లెయిర్‌ టిక్నెర్‌ జట్టులో చోటు దక్కించుకోగా... గాయం నుంచి పూర్తిగా కోలుకోని కైల్‌ జెమీసన్‌ను ఈ సిరీస్‌కు పరిగణించలేదు.   

వెస్టిండీస్‌తో టెస్టులకు న్యూజిలాండ్ జట్టు 
టామ్ లాథమ్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్‌నర్, కేన్‌ విలియమ్సన్‌, విల్‌ యంగ్‌.

చదవండి: అసలు సెన్స్‌ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్‌

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)