Breaking News

Asia Cup 2025: టీమిండియాకు భారీ షాక్‌..!?

Published on Sat, 08/02/2025 - 12:58

టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ నుంచి స్వ‌దేశానికి వ‌చ్చేయ‌నున్నాడు. వ‌ర్క్‌లోడ్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆఖ‌రి టెస్టుకు దూర‌మైన బుమ్రాను జ‌ట్టు నుంచి బీసీసీఐ విడుద‌ల చేసింది. భార‌త్‌కు చేరుకున్నాక బుమ్రా దాదాపు నెల రోజుల పైనా విశ్రాంతి తీసుకోనున్నాడు.

అత‌డు తిరిగి మ‌ళ్లీ సెప్టెంబ‌ర్‌లో మైదానంలో అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది. అయితే బుమ్రా విష‌యంలో సెల‌క్ట‌ర్లకు, టీమ్ మెనెజ్‌మెంట్‌కు మ‌రోక‌ చిక్కు వ‌చ్చి ప‌డింది. బుమ్రాను ఆసియా క‌ప్‌(టీ20 ఫార్మాట్‌)లో ఆడించాలా లేదా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయాలో సెల‌క్ట‌ర్లకు ఆర్ధం కావ‌డం లేదు.

ఎందుకంటే ఆసియాక‌ప్ సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 29న ముగుస్తుంది. అక్క‌డికి నాలుగు రోజుల త‌ర్వాత అక్టోబర్ 2-6 వరకు భార‌త జ‌ట్టు వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదిక‌గా తొలి టెస్టులో ఆడ‌నుంది. ఒక‌వేళ భార‌త్ ఫైన‌ల్‌కు చేరి, వెంట‌నే విండీస్‌తో తొలి టెస్టులో బుమ్రా ఆడాలంటే అది ఆసాధ్య‌మ‌నే చెప్పుకోవాలి.

బుమ్రా ప్రస్తుతం అంత ఫిట్‌గా లేడు. ఇంగ్లండ్ టూర్‌లో కూడా కేవ‌లం మూడు టెస్టులు మాత్ర‌మే ఆడాడు. ఇప్పుడు ఇదే సెల‌క్ట‌ర్ల‌కు, టీమ్ మెనెజ్‌మెంట్ త‌ల‌నొప్పిగా మారింది. తాజాగా ఇదే విష‌యంపై ఓ బీసీసీఐ సీనియ‌ర్ అధికారి ఒక‌రు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

బుమ్రా దూరం?
"బుమ్రా ఆసియాక‌ప్‌లో ఆడి.. ఒక‌వేళ‌ బార‌త్ ఫైన‌ల్‌కు చేరితే అత‌డు అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగే తొలి టెస్టుకు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే అత‌డు త‌న వ‌ర్క్‌లోడ్‌ను మెనెజ్ చేయ‌లేడు. అత‌డిని ఆసియాక‌ప్‌లో ఆడించాలా లేదా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయాలా అన్న‌ది సెల‌క్ట‌ర్లు నిర్ణ‌యం తీసుకుంటారు.

అంతేకాకుండా నవంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికాతో రెండు టెస్టులు ఆడాల్సి వ‌చ్చింది. కాబ‌ట్టి చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి. వారిద్ద‌రికి ఇది ఒక స‌వాల్‌గా మార‌నుంది" అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

కాగా వెస్టిండీస్‌, ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌లు  ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జ‌ర‌గనున్నాయి. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ ప్ర‌స్తుతం నాలుగో స్దానంలో ఉంది. కాబ‌ట్టి ఈ రెండు సిరీస్‌లు టీమిండియాకు కీల‌కం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో బుమ్రాను ఆసియాక‌ప్‌న‌కు బ‌దులుగా విండీస్‌, ప్రోటీస్ సిరీస్‌లో ఆడించే అవ‌కాశ‌ముంది.
చదవండి: IPL 2026: గైక్వాడ్‌పై వేటు.. సీఎస్‌కే కెప్టెన్‌గా టీమిండియా స్టార్! అత‌డిపై కూడా క‌న్ను?
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)