Breaking News

IND vs ENG 3rd Test: జేమీ స్మిత్‌ ప్రపంచ రికార్డు

Published on Fri, 07/11/2025 - 17:10

ఇంగ్లండ్‌ యువ క్రికెటర్‌ జేమీ స్మిత్‌ (Jamie Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో మూడో టెస్టు సందర్భంగా లార్డ్స్‌ (Lord's Test)లో జేమీ స్మిత్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

సర్రేకు చెందిన జేమీ స్మిత్‌.. గతేడాది వెస్టిండీస్‌తో సిరీస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా టీమిండియాతో సిరీస్‌లో మాత్రం 24 ఏళ్ల జేమీ స్మిత్‌ దుమ్ములేపుతున్నాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో 40, 44* పరుగులు చేసిన జేమీ స్మిత్‌.. రెండో టెస్టులో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

భారీ అజేయ శతకం
తొలి ఇన్నింగ్స్‌లో భారీ అజేయ శతకం (184)తో మెరిసి ఇంగ్లండ్‌ ఓటమి వాయిదా పడేలా చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుత అర్ధ శతకం (88) బాదినా.. పరాజయం నుంచి జట్టును తప్పించలేకపోయాడు.

ఇక తాజాగా లార్డ్స్‌ వేదికగా మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కుకు చేరుకున్నాడు జేమీ స్మిత్‌. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది ఈ మైలురాయిని అందుకున్నాడు. అనంతరం స్మిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్‌ రాహుల్‌ జారవిడిచాడు. ఫలితంగా లైఫ్‌ పొందిన జేమీ స్మిత్‌.. 52 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వరల్డ్‌ రికార్డు
కాగా తక్కువ ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్న వి​కెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సౌతాఫ్రికా స్టార్‌ క్వింటన్‌ డికాక్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జేమీ స్మిత్‌ ఈ సందర్భంగా సమం చేశాడు. అదే విధంగా.. అతి తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా వరల్డ్‌ రికార్డు సాధించాడు.

తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు
🏏క్వింటన్‌ డి కాక్‌, జేమీ స్మిత్‌- 21 ఇన్నింగ్స్‌లో
🏏దినేశ్‌ చండిమాల్‌, జానీ బెయిర్‌స్టో- 22 ఇన్నింగ్స్‌లో
🏏కుమార్‌ సంగక్కర, ఏబీ డివిలియర్స్‌- 23 ఇన్నింగ్స్‌లో
🏏జెఫ్‌ డుజోన్‌- 24 ఇన్నింగ్స్‌లో

తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు
🏏జేమీ స్మిత్‌ (ఇంగ్లండ్‌)- 1303 బంతుల్లోనే
🏏సర్ఫరాజ్‌ అహ్మద్‌ (పాకిస్తాన్‌)- 1311 బంతుల్లో
🏏ఆడం గిల్‌క్రిస్ట్‌ (ఆస్ట్రేలియా)- 1330 బంతుల్లో
🏏నిరోషన్‌ డిక్‌విల్లా (శ్రీలంక)- 1367 బంతుల్లో
🏏క్వింటన్‌ డి కాక్‌ (సౌతాఫ్రికా)- 1375 బంతుల్లో.

👉ఇదిలా ఉంటే.. టీమిండియా మూడో టెస్టులో భాగంగా శుక్రవారం నాటి రెండో ఆటలో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్‌ 105 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. 

చదవండి: రోహిత్‌ శర్మకు భారీ షాక్‌!?.. వన్డే కెప్టెన్‌గానూ గిల్‌?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)