Breaking News

రూ. 18 కోట్లు! .. వరుస వైఫల్యాలు.. అందరి కళ్లు అతడి మీదే..

Published on Sat, 04/05/2025 - 16:40

యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal).. ఈ టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తన కెరీర్‌కు పునాది వేసిన ముంబై క్రికెట్‌ను వీడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. తదుపరి దేశవాళీ సీజన్‌లో గోవాకు ఆడనుండటం చర్చకు దారితీసింది. ముంబై కెప్టెన్‌ అజింక్య రహానే, యాజమాన్యంతో విభేదాల వల్లే జైసూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు రావడం గమనార్హం.

వరుస వైఫల్యాలు.. 
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా యశస్వి జైస్వాల్‌ ఫామ్‌లేమితో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో, ఇంగ్లండ్‌తో వన్డేలోనూ పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఇక ఐపీఎల్‌-2025 (IPL 2025)లోనూ యశస్వి జైస్వాల్‌ బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతోంది.

రూ. 18 కోట్లకు రిటైన్‌ చేసుకుంటే..
మెగా వేలానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ తమ ఓపెనర్‌ జైసూను ఏకంగా రూ. 18 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అతడు తేలిపోయాడు. తన స్థాయికి తగ్గట్లుగా ఒక్కసారీ బ్యాట్‌ ఝులిపించలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 11.33 సగటుతో 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిచింది. ఇక శనివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్‌ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అతడే ముఖ్యం
‘‘జైస్వాల్‌ ఇప్పటికీ పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఓపెనర్‌గా తను బ్యాట్‌ ఝులిపిస్తేనే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. జట్టులో అతడు అత్యంత కీలక సభ్యుడు. తప్పక పరుగులు చేయాల్సిన బాధ్యత అతడిపై ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో అందరి దృష్టి అతడి మీదే కేంద్రీకృతమై ఉంటుందనడంలో సందేహం లేదు’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

సంజూ రాకతో
ఇక పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా సంజూ శాంసన్‌ కెప్టెన్‌గా విధుల్లో చేరనుండటం రాజస్తాన్‌కు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా, కీపర్‌గా రాయల్స్‌ సంజూను మిస్‌ అయింది.

పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో అతడు దిట్ట. కీపర్‌గానూ జట్టుకు అతడి సేవలు ముఖ్యం. కాబట్టి అతడి రాకతో జట్టులో సానుకూల వాతావరణం ఏర్పడింది’’ అని పేర్కొన్నాడు.

చదవండి: IPL 2025 MI Vs LSG: బెడిసికొట్టిన వ్యూహం.. ఏం చేస్తున్నావ్‌ హార్దిక్‌? .. ఆకాశ్‌ అంబానీ రియాక్షన్‌ వైరల్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)