Breaking News

ODI WC 2027: భారత వన్డే జట్టు.. ఊహించని పేరు!

Published on Thu, 01/22/2026 - 19:30

టీమిండియా టీ20 ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు అతడు శుభారంభం అందించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు ఈ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌.

1199 పరుగులు
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ శర్మ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా తరఫున ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఏడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 190.93 కావడం విశేషం.

వరల్డ్‌కప్‌ -2027 జట్టులోనూ 
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిషేక్‌ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. వరల్డ్‌కప్‌ -2027 జట్టులోనూ అతడికి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.

ఈ మేరకు.. ‘‘యాభై ఓవర్ల ప్రపంచకప్‌ టోర్నీ ఎంపిక సమయంలో అభిషేక్‌ శర్మ పేరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు.

అయితే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి టీ20లలో మాదిరే వన్డే పవర్‌ప్లేలోనూ అభిషేక్‌ శర్మ సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా అభిషేక్‌ శర్మ ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు.

రోహిత్‌- గిల్‌ జోడీ
ఇక వన్డేల్లో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా ప్రస్తుత సారథి శుబ్‌మన్‌ గిల్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సన్నాహకంగా సాగుతున్న న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అభిషేక్‌ శర్మ ఇదే జోరు కనబరిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

ఇక గత కొంతకాలంగా వరుస సిరీస్‌ విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ ఈసారి కూడా హాట్‌ ఫేవరెట్‌గా వరల్డ్‌కప్‌ బరిలో దిగుతోంది. కాగా 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)