Breaking News

రోహిత్‌ శర్మ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌

Published on Fri, 01/30/2026 - 11:09

ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం రోహిత్‌ శర్మ పేరిట ఉన్న అరుదైన టీ20 ప్రపంచ రికార్డును అతడు బద్దలు కొట్టాడు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)తో తొలి టీ20 సందర్భంగా స్టిర్లింగ్‌ ఈ ఘనత సాధించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటారా?!

టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఐర్లాండ్‌ జట్టు.. యూఏఈ పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. గురువారం తొలి టీ20 జరిగింది. దుబాయ్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.

మెరుపు ఇన్నింగ్స్‌
ఓపెనర్లలో కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (8) విఫలం కాగా.. రాస్‌ అడేర్‌ (39) మెరుగ్గా రాణించాడు. మిగిలిన వారిలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లోర్కాన్‌ టకర్‌ (25 బంతుల్లో 38), కర్టిస్‌ కాంఫర్‌ (25) ఫర్వాలేదనిపించగా.. బెంజమిన్‌ కలిజ్‌ (12 బంతుల్లో 26 నాటౌట్‌), జార్జ్‌ డాక్రేల్‌ (10 బంతుల్లో 22 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునైద్‌ సిద్దిఖి, హైదర్‌ అలీ చెరో రెండు.. ముహమ్మద్‌ అర్ఫాన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో 19.5 ఓవర్లలో 121 పరుగులకే యూఏఈ ఆలౌట్‌ అయింది.

57 పరుగుల తేడాతో విజయం 
ఐర్లాండ్‌ బౌలర్లు మాథ్యూ హాంప్రేస్‌, గరేత్‌ డెలాని తలా మూడు వికెట్లు పడగొట్టి యూఏఈ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. బారీ మెకార్తి రెండు వికెట్లు పడగొట్టాడు. జార్జ్‌ డాక్రేల్‌, మార్క్‌ అడేర్‌ చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి టీ20లో ఐర్లాండ్‌ 57 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.

ఇక పాల్‌ స్టిర్లింగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఇది 160వ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. తద్వారా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్‌ పొట్టి ఫార్మాట్లో.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా.. భారత మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును స్టిర్లింగ్‌ బద్దలు కొట్టాడు. కాగా 2024లో టీమిండియాకు టీ20 వరల్డ్‌కప్‌ అందించిన తర్వాత అంతర్జాతయ టీ20లకు రోహిత్‌ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు
పాల్‌ స్టిర్లింగ్‌ (ఐర్లాండ్‌): 2009- 2026*- 160 మ్యాచ్‌లు
రోహిత్‌ శర్మ (ఇండియా): 2007-2024- 159 మ్యాచ్‌లు
జార్జ్‌ డాక్రేల్‌ (ఐర్లాండ్‌): 2010-2026*- 153 మ్యాచ్‌లు
మహ్మద్‌ నబీ (అఫ్గనిస్తాన్‌): 2010-2026- 148 మ్యాచ్‌లు
జోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌): 2011-2025- 144 మ్యాచ్‌లు.

చదవండి: Kohli Instagram Deactivate: ఇన్‌స్టాకు గుడ్‌బై ?.. కంగారుపడ్డ విరాట్‌ కోహ్లి ఫ్యాన్స్‌!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)