Breaking News

PBKS VS KKR: మొన్న ఫిలిప్స్‌.. నిన్న రసెల్‌

Published on Tue, 05/09/2023 - 08:55

ఐపీఎల్‌ 2023లో మరో మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ చివరి బంతికి విజయం సాధించి, ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్‌లో ఆఖరి బంతివరకు సాగిన మ్యాచ్‌ల్లో (6) ఇది వరుసగా రెండవది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (47 బంతుల్లో 57;  9 ఫోర్లు,సిక్స్‌), ఆఖర్లో షారుక్‌ ఖాన్‌ (8 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ (8 బంతుల్లో 12), లివింగ్‌స్టోన్‌ (9 బంతుల్లో 15), జితేశ్‌ శర్మ (18 బంతుల్లో 21), రిషి ధవన్‌ (11 బంతుల్లో 19), హర్ప్రీత్‌ బ్రార్‌ (9 బంతుల్లో 17 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగా.. భానుక రాజపక్ష (0), సామ్‌ కర్రన్‌ (9 బంతుల్లో 4) విఫలమయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 3, హర్షిత్‌ రాణా 2, సుయాశ్‌ శర్మ, నితీశ్‌ రాణా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌.. జేసన్‌ రాయ్‌ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్‌ రాణా (38 బంతుల్లో 51; ఫోర్‌, సిక్స్‌), ఆండ్రీ రసెల్‌ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్‌ 10 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రహ్మానుల్లా గుర్భాజ్‌ (15), వెంకటేశ్‌ అయ్యర్‌ (11) రెండంకెల స్కోర్‌ చేశారు. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ 2, నాథన్‌ ఇల్లిస్‌, హర్ప్రీత్‌ బ్రార్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

మొన్న ఫిలిప్స్‌.. నిన్న రసెల్‌.
ఛేదనలో కేకేఆర్‌ ఆరంభంలో దూకుడుగానే ఆడినప్పటికీ మధ్యలో స్కోర్‌ కాస్త నెమ్మదించడంతో మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు సాగింది. మొన్న రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లు గ్లెన్‌ ఫిలిప్స్‌, అబ్దుల్‌ సమద్‌లు ఏ పాత్ర అయితే పోషించారో.. నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌ ప్లేయర్స్‌ రసెల్‌, రింకూ సింగ్‌ కూడా అదే పాత్ర పోషించారు. క్లిష్ట సమయంలో ఫిలిప్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (7 బంతుల్లో 25; ఫోర్‌, 3 సిక్సర్లు) ఆడి గెలుపుపై ఆశలు లేని ఎస్‌ఆర్‌హెచ్‌ను గేమ్‌లోకి తేగా.. ఆఖరి బంతికి అబ్దుల్‌ సమద్‌ (7 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు) సిక్సర్‌ బాది గెలిపించాడు.

ఇంచుమించు అలాగే పంజాబ్‌తో మ్యాచ్‌లో రసెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ను గెలుపు ట్రాక్‌లో పెడితే, రింకూ సింగ్‌ ఆఖరి బంతికి బౌండరీ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఫిలిప్స్‌ తరహాలోనే నిన్నటి మ్యాచ్‌లో రసెల్‌ కూడా 19వ ఓవర్‌లో శివాలెత్తిపోయాడు. ఆ మ్యాచ్‌లో ఫిలిప్స్‌.. కుల్దీప్‌ బౌలింగ్‌లో 3 సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదితే.. నిన్నటి మ్యాచ్‌లో సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో రసెల్‌ 3 సిక్సర్లతో విరుచుకుపడి, మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఫిలిప్స్‌, రసెల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడకపోయుంటే రెం‍డు మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులు గెలిచేవారు. అలాగే సన్‌రైజర్స్‌, కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించేవి. 

చదవండి: ఐపీఎల్‌లో ధావన్‌ అరుదైన రికార్డు.. కోహ్లి, వార్నర్‌ సరసన

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)