మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
ఆడడం లేదని పక్కనబెట్టారు.. తన విలువేంటో చూపించాడు
Published on Sun, 05/08/2022 - 10:07
ఐపీఎల్-2022 లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్(41 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తన విలువేంటో చూపించాడు. ఈ సీజన్‌లో సరైన ప్రదర్శన ఇవ్వని కారణంగా ఏడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న జైశ్వాల్ శనివారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అతను మెరవడమే కాదు.. జట్టు విజయం సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు.సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌కు ఇది ఏడో విజయం.. ఈ విజయంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. రాజస్తాన్‌కు సీజన్‌లో ఇప్పటివరకు సాధించిన ఆరు విజయాలు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ద్వారా వచ్చాయి. కాగా తొలిసారి రెండో సారి బ్యాటింగ్ చేసి ఆ జట్టు గెలవడం విశేషం.
యశస్వి జైశ్వాల్ గతేడాది ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో రూ. 4 కోట్లకు రాజస్తాన్ దక్కించుకుంది. సీజన్ లో తొలి 3 మ్యాచులు సరిగా రాణించలేదు. మూడు మ్యాచుల్లో కలిపి అతడు 25 (20, 1, 4) మాత్రమే చేయడంతో ఆ తర్వాత మ్యాచులకు అతడిని పక్కనబెట్టారు. కానీ ఏడు మ్యాచ్‌ల తర్వాత పునరాగమనం చేసిన జైస్వాల్ తనదైన ఆటతో మెరిశాడు. కీలక సమయంలో రెచ్చిపోయి ఆడి రాజస్తాన్ ను ప్లేఆఫ్స్ కు మరింత చేరువ చేశాడు.
చదవండి: Shivam Mavi: ఒక్క ఓవర్ 30 పరుగులు.. కేకేఆర్ బౌలర్‌కు పీడకలే!
That's that from Match 52 as @rajasthanroyals win by 6 wickets.#TATAIPL #PBKSvRR pic.twitter.com/RloiU9m1LJ
— IndianPremierLeague (@IPL) May 7, 2022
Tags : 1