Breaking News

గిల్‌ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల స్పందన ఇదే

Published on Fri, 01/09/2026 - 13:14

గతేడాది కాలంలో టెస్టు క్రికెట్‌లో టీమిండియా ఘోర పరాభవాలు చవిచూసింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌ చేతిలో చరిత్రలో లేనివిధంగా 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (BGT) కోల్పోయింది.

ఇక ఇటీవల కొత్త కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సారథ్యంలో.. పాతికేళ్ల తర్వాత తొలిసారి సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈసారి కూడా టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2027 (WTC) ఫైనల్‌కు చేరడం కష్టమే.

గిల్‌ ప్రతిపాదన ఇదే
ఈ నేపథ్యంలో శుబ్‌మన్‌ గిల్‌ ఇటీవల బీసీసీఐ ముందు ఓ ప్రతిపాదన తీసుకువచ్చాడనే వార్త వైరల్‌ అయింది. టెస్టు సిరీస్‌కు ముందు కనీసం 15 రోజులు ప్రాక్టీస్‌ ఉండేలా షెడ్యూల్‌ చేయాలని గిల్‌ బోర్డు పెద్దలను కోరినట్లు తెలిసింది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప తాజాగా స్పందించాడు.

వింతైన, విలువైన నిర్ణయం
గిల్‌ నిర్ణయాన్ని సమర్థించిన ఊతప్ప... ‘‘ఓ నాయకుడి నుంచి వచ్చిన అత్యంత వింతైన, విలువైన నిర్ణయం ఇది. ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. టెస్టు క్రికెట్‌ను గిల్‌ చూస్తున్న కోణం ఇది. నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం.

టెస్టు సిరీస్‌కు కనీసం రెండువారాల ముందు జట్టు సన్నాహకాలు మొదలుపెట్టడం మంచిది. కేవలం టెస్టు సిరీస్‌ గెలవడమే లక్ష్యం కాదు.. మన అంతిమ లక్ష్యం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలవడం.

అది జరగాలంటే.. మన ప్రణాళిక, సన్నాహకాలు నిర్మాణాత్మకంగా ఉండాలి. టెస్టు ‍క్రికెట్‌ పట్ల భక్తితో కూడిన గౌరవం ఉండాలి. గిల్‌ తెచ్చిన ఈ ప్రతిపాదన నాకెంతో సంతోషాన్నిచ్చింది’’ అని పేర్కొన్నాడు. 

ఆకాశ్‌ చోప్రా సైతం
ఇక ఊతప్ప మాదిరే టీమిండియా మరో మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం టెస్టు క్రికెట్‌ విషయంలో గిల్‌ ప్రపోజల్‌ను సమర్థించాడు. సంప్రదాయ ఫార్మాట్‌లో భారత్‌ మళ్లీ మునుపటి స్థాయిలో రాణించాలంటే పూర్తిస్థాయి ప్రిపరేషన్‌ అవసరమని పేర్కొన్నాడు.

చదవండి: ఇదీ మీ స్థాయి: పాక్‌ బోర్డును ఏకిపారేస్తున్న నెటిజన్లు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు