Breaking News

అదరగొట్టిన భారత ఓపెనర్లు

Published on Tue, 07/14/2026 - 18:30

శ్రీలంక అండర్‌-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టులో భారత్‌ అండర్‌ -19 ఓపెనర్లు అదరగొడుతున్నారు. లక్ష్య రాజేశ్‌ రాయ్‌ చందాని, సాగర్‌ విర్క్‌ పట్టుదలగా నిలబడి భారత్ జట్టుకు శుభారంభం అందించారు.

కాగా గాలె వేదికగా భారత్‌- శ్రీలంక మధ్య సోమవారం  తొలి యూత్‌ టెస్టు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగి.. మొదటి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఓపెనర్లు దిమంత మహావితన (2), దుల్నిత్‌ సిగెర (0) విఫలమైనా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ వెకునగొడ దుమ్ములేపాడు.

మొత్తంగా 267 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 233 పరుగులు సాధించాడు. సెనుజ డబుల్‌ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ విమత్‌ దిన్సార (52), కవిజ గమాగె (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్‌) రాణించారు.

ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద శ్రీలంక మంగళవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా తమ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం భారత్‌ బ్యాటింగ్‌ మొదలుపెట్టగా వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం కలిగింది.

అయితే, వాన తెరిపినివ్వడంతో తిరిగి ఆట మొదలుకాగా.. ఓపెనర్లు లక్ష్య, సాగర్‌ నిలకడగా ఆడారు. లక్ష్య 136 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 93 పరుగులు.... సాగర్‌ 215 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

ఫలితంగా రెండో రోజు పూర్తయ్యేసరికి భారత్‌ అండర్‌-19 జట్టు 58 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 186 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది. ఇక రెండో రోజు మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 186 పరుగులు చేసిన భారత్‌ మొత్తానికి మంగళవారం పైచేయి సాధించింది.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)