అసలు సమరానికి సమయం

Published on Sun, 02/15/2026 - 02:55

ఫిబ్రవరి 1...టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్‌... 
ఫిబ్రవరి 5...మాకు అవన్నీ తెలీదు...మా కొలంబో ఫ్లయిట్‌ బుక్‌ అయిపోయిందన్న సూర్యకుమార్‌... 
ఫిబ్రవరి 9...భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు మేం సిద్ధమంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వ ప్రకటన... 
ఫిబ్రవరి 15...భారత్, పాక్‌ మధ్య కొలంబోలో మ్యాచ్‌కు రంగం సిద్ధం...

ప్రపంచకప్‌లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్‌లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు...1992 నుంచి అభిమానులు ఇది చూస్తూనే వచ్చారు...ఫలితం ఎలా ఉన్నా, ఏకపక్షంగా సాగినా ఈ మ్యాచ్‌కు ఉండే ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై సాగే సుదీర్ఘ వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ లేదంటే సహజంగానే పెద్ద చర్చే జరిగింది. 

కానీ ఇప్పుడు అంతా మారిపోయింది...కొలంబో వెళ్లే ఫ్లయిట్‌ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటే హోటళ్లలో ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనా ఖాళీ లేదనే సమాధానం వచ్చేస్తోంది. మైదానంలోనే ఉండి జట్టుకు మద్దతుగా నిలవాలనుకునే వేలాది మంది మాత్రమే కాదు...తమ ఇళ్లనుంచి కన్నార్పకుండా ప్రతీ బంతిని చూసే ఫ్యాన్స్‌ సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మరో వరల్డ్‌ కప్‌ పోరుకు ఇరు జట్లు సై అంటున్నాయి. ఇటీవల ఆసియా కప్‌లో 3–0తో పాక్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో చెలరేగుతుందో చూడాలి.  

కొలంబో: టి20 వరల్డ్‌ కప్‌లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్, పాకిస్తాన్‌ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతీ టి20 వరల్డ్‌ కప్‌లో తలపడుతున్న ఇరు జట్లు ఈ సారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో నేడు (ఆదివారం) జరిగే గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత్‌ ఎదుర్కొంటుంది. 

రెండు జట్లూ తమ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా...ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈ సారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్‌ భావిస్తోంది.  

కుల్దీప్‌కు అవకాశం... 
భారత బ్యాటింగ్‌ లైనప్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్‌ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకూ సింగ్‌కు తగిన అవకాశం రాకపోగా, తిలక్‌ వర్మ కూడా రెండు సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా గత మ్యాచ్‌ తరహాలో భారీ స్కోరు ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కించుకున్న సామ్సన్‌ మాత్రం విఫలమయ్యాడు. 

అభిషేక్‌ శర్మ అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే సామ్సన్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్‌ అయిన అభిషేక్‌ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్‌ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో అతను అందించే ఆరంభం భారత్‌ భారీ స్కోరుకు పునాది అవుతుంది. బౌలింగ్‌కు సంబంధించి తుది జట్టులో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఇక్కడి పిచ్‌ను బట్టి చూస్తే భారత్‌ మూడో రెగ్యులర్‌ స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు ‘మిస్టరీ’గానే ఉన్న వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌లతో పాటు కుల్దీప్‌ను కూడా ఆడించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అర్ష్ దీప్ స్థానంలో అతను ఆడతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్‌ భారం పంచుకుంటారు కాబట్టి రెగ్యులర్‌ పేసర్‌గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవలి ఫామ్, బలాబలాలను చూస్తే పాక్‌కంటే టీమిండియా ఎంతో ముందుంది.  

బాబర్‌ ఆజమ్‌ రాణించేనా... 
అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్‌ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. పాక్‌ ఇప్పటికే ఇద్దరు రెగ్యులర్‌ స్పిన్నర్లు అబ్రార్, తారిఖ్‌లతో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్లు నవాజ్, షాదాబ్‌లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్‌ కూడా స్పిన్‌ బౌలింగ్‌ చేయగలడు. వీరిలో తారిఖ్‌ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్‌ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా, చర్చనీయాంశమైన యాక్షన్‌తో ఆడే ఆఫ్‌స్పిన్నర్‌ తారిఖ్‌ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరం. 

భారత్‌ తమ సన్నాహకాల్లో దీనిపై కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు. పేసర్‌ షాహిన్‌ అఫ్రిది చాలా కాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్‌లో టాప్‌–4 మాత్రమే రెగ్యులర్‌ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్‌ ఆగా ఆసియా కప్‌లో భారత్‌పై వరుసగా విఫలమవగా, ఫర్హాన్‌ ఒక్కడే రాణించాడు. 

కెప్టెన్ అయిన తర్వాత సల్మాన్‌ ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తమ జట్టుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా స్టార్‌ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాబర్‌ ఆజమ్‌ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడి చాలా కాలమైంది. అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇంతకంటే సమయం, వేదిక ఉండవని పాక్‌ అభిమానులు భావిస్తున్నారు.  

 

13 భారత్, పాక్‌ మధ్య ఓవరాల్‌గా 16 మ్యాచ్‌లు జరగ్గా...13 గెలిచిన భారత్‌ 3 ఓడింది.

7-1 టి20 ప్రపంచ కప్‌లో భారత్, పాక్‌ మధ్య 8 మ్యాచ్‌లు జరగ్గా... భారత్‌ 7 గెలిచి ఒకటే ఓడింది.

పిచ్, వాతావరణం 
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. అయితే బౌలర్లూ ప్రభావం చూపించగలరు. మ్యాచ్‌కు ముందు రోజు మాత్రమే భారత్‌ ఇక్కడ సాధన చేసింది. పాక్‌ జట్టు కొలంబోలోనే ఉన్నా... తమ రెండు మ్యాచ్‌లను ఎస్‌ఎస్‌సీ మైదానంలో ఆడింది కాబట్టి తేడా ఉండకపోవచ్చు. అయితే మ్యాచ్‌ను వాన గండం వెంటాడుతోంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.  

తుది జట్లు (అంచనా): 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్, ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా 
పాకిస్తాన్‌: సల్మాన్‌ ఆగా (కెప్టెన్ ), ఫర్హాన్, అయూబ్, బాబర్‌ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్, నవాజ్, ఫహీమ్, షాహిన్‌ అఫ్రిది, తారిఖ్, అబ్రార్‌ 

టి20 ప్రపంచకప్‌లో నేడు
వెస్టిండీస్‌ X  నేపాల్‌
వేదిక: ముంబై; ఉదయం 11 గంటల నుంచి
అమెరికా X  నమీబియా
వేదిక: చెన్నై; మధ్యాహ్నం 3 గంటల నుంచి

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)