Breaking News

భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌ రద్దు..!

Published on Tue, 11/18/2025 - 15:57

భారత్‌, బంగ్లాదేశ్‌ (India vs Bangladesh) మహిళా క్రికెట్‌ జట్ల మధ్య వచ్చే నెలలో (డిసెంబర్‌) జరగాల్సిన  పరిమిత ఓవర్ల సిరీస్‌ (మూడు వన్డేలు, మూడు టీ20లు) రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌కు అనుమతి లభించలేదని బీసీసీఐ వర్గాల సమాచారం. 

ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో (FTP) భాగమైన ఈ సిరీస్‌కు సంబంధించి ఖచ్చితమైన తేదీలు, వేదికలు ​ఖరారు కావాల్సి ఉండింది. ఈ లోపే రద్దు నిర్ణయం వెలువడిందంటూ ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. 

ఈ సిరీస్‌ జరగాల్సిన సమయంలో (డిసెంబర్‌ మూడో వారం) బీసీసీఐ ప్రత్యామ్నాయ హోమ్‌ సిరీస్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) దృష్ట్యా ఈ సిరీస్ చిన్నదిగా ఉండే అవకాశం ఉందని సమాచారం​. డబ్ల్యూపీఎల్‌ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది.  

కాగా, కొద్ది రోజుల కిందట పురుషుల క్రికెట్‌లో భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగాల్సిన సిరీస్‌ వాయిదా పడింది. ఆగస్టులో భారత పురుషుల జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉండింది. అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆ సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు మార్చారు.

ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో చివరి జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించిన టీమిండియా.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించింది. భారత మహిళల జట్టుకు ఇదే తొలి ప్రపంచకప్‌. 

చదవండి: బాబర్‌ ఆజమ్‌కు భారీ షాక్‌

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)