Breaking News

వైభవ్ విఫలమైనా.. టీమిండియా భారీ స్కోర్‌

Published on Sat, 01/03/2026 - 18:50

బెనోని వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా అండ‌ర్‌-19తో జ‌రుగుతున్న మొద‌టి యూత్ వ‌న్డేలో భార‌త్ అండ‌ర్‌-19 జట్టు బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ(11), వైస్ కెప్టెన్ ఆరోన్ జార్జ్(11), త్రివేది(21) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి.. మిడిలార్డర్‌, లోయార్డర్ బ్యాటర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

ముఖ్యంగా 19 ఏళ్ల హర్వంశ్ సింగ్ పంగాలియా అసాధరణ పోరాటం కనబరిచాడు. క్లిష్ట సమయంలో హర్వంశ్‌.. అంబరీష్‌తో కలిసిఐదో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పంగాలియా 95 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంబరిష్‌(65), కన్షిక్ చౌహన్‌(32), ఖిలాన్ పటేల్‌(26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

సౌతాఫ్రికా బౌలర్లలో బాసన్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. సోనీ,బాసన్‌, మబాతా తలా వికెట్ సాధించారు. కాగా ఈ సిరీస్ అండర్‌-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతోంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ అయూష్ మాత్రే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే వైభవ్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. కానీ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ విఫలమయ్యాడు.

తుది జట్లు
భారత్ అండర్‌19: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ వర్గీస్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వంశ్ పంగాలియా, ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, మహమ్మద్ ఎనాన్, ఖిలన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్.

దక్షిణాఫ్రికా అండర్ -19:మొహమ్మద్ బుల్బులియా (కెప్టెన్), జోరిచ్ వాన్ షాల్క్‌వైక్, అద్నాన్ లగాడియన్, జేసన్ రౌల్స్, అర్మాన్ మనక్, పాల్ జేమ్స్, బండిల్ మబాతా, లెతాబో పహ్లామోహ్లాకా (కీపర్), జెజె బాసన్, బయండా మజోలా, నితాండో సోని.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ వచ్చేశాడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)