Breaking News

SA Tour: ఉన్న పళంగా స్వదేశానికి బయల్దేరిన ఇషాన్‌ కిషన్‌

Published on Sun, 12/17/2023 - 16:47

దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా యంగ్‌ వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌, పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ ఉన్న పలంగా స్వదేశానికి బయల్దేరాడు. వ్యక్తిగత కారణాల చేత ఇషాన్‌ ఇండియాకు బయల్దేరాడని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. 

భారత టెస్ట్‌ జట్టులో ఇషాన్‌ స్థానాన్ని కేఎస్‌ భరత్‌ భర్తీ చేస్తాడని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్న భరత్‌.. భారత టెస్ట్‌ జట్టుతో త్వరలోనే కలుస్తాడని పేర్కొంది. 

కాగా, సౌతాఫ్రికా పర్యటనలో​ టీ20, టెస్ట్‌ సిరీస్‌ల కోసం భారత సెలెక్టర్లు ఇషాన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీ20ల్లో​ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం దక్కని ఇషాన్‌.. టెస్ట్‌ సిరీస్‌పై ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఉన్నట్లుండి అతను ఇంటి వెళ్లిపోవడంతో అనూహ్యంగా కేఎస్‌ భరత్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపు అందింది. భరత్‌.. కేఎల్‌ రాహుల్‌ తర్వాత రెండో వికెట్‌కీపర్‌ ఛాయిస్‌గా టీమిండియాలో చేరతాడు. 

సౌతాఫ్రికాతో రెండు టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్‌ భరత్ (వికెట్‌కీపర్‌)

భారత్‌-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్‌ సెంచూరియన్‌ వేదికగా డిసెంబర్‌ 26-30 మధ్యలో జరుగనుండగా.. రెండో టెస్ట్‌ కేప్‌టౌన్‌ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 మధ్యలో​ జరుగుతుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)