Breaking News

వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భార‌త్‌.. సిరీస్ క్లీన్ స్వీప్‌

Published on Tue, 10/14/2025 - 10:33

ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. విండీస్ విధించిన 121 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో గిల్ సేన‌ క్లీన్ స్వీప్ చేసింది.

63/1 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో ఆఖ‌రి రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త్ సాయిసుద‌ర్శ‌న్‌(39), కెప్టెన్ గిల్‌(13) వికెట్‌ను కోల్పోయింది. స్టార్ బ్యాట‌ర్లు కేఎల్ రాహుల్‌(58 నాటౌట్‌), ధ్రువ్ జురెల్(6 నాటౌట్‌) మ‌రో వికెట్ కోల్పోకుండా జాగ్ర‌త్త‌గా ఆడి మ్యాచ్ ఫినిష్ చేశారు. విండీస్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ ఛేజ్ రెండు, వారిక‌న్ ఓ వికెట్ సాధించారు. కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజ‌యం. 
 

సెంచ‌రీలతో మెరిసిన హోప్‌, క్యాంప్‌బెల్‌..
కాగా ఈ మ్యాచ్‌లో భార‌త్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఫాల్ ఆన్ ఆడిన వెస్టిండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుత‌మైన పోరాటం క‌న‌బ‌రిచింది.  ఓపెనర్‌ జాన్‌ క్యాంప్‌బెల్‌ (199 బంతుల్లో 115; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), షై హోప్‌ (214 బంతుల్లో 103; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో క‌దం తొక్కారు. 

దీంతో క‌రేబియ‌న్ జ‌ట్టు రెండో ఇన్నింగ్స్‌లో 390 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఓ ద‌శలో భార‌త్ ముందు మెరుగైన టార్గెట్‌ను ఉంచేలా క‌న్పించిన విండీస్ బ్యాట‌ర్లు.. మ‌రోసారి కుల్దీప్ యాద‌వ్ స్పిన్ మ‌యాజాలానికి చిత్తు అయ్యారు. వ‌రుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను ముగించింది.

అంత‌కుముందు టీమిండియా త‌మ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 518 ర‌న్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయ‌గా.. వెస్టిండీస్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 248 ర‌న్స్ చేసి ఫాలోఆన్ ఆడింది. అంత‌కుముందు టీమిండియా త‌మ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 518 ర‌న్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయ‌గా.. వెస్టిండీస్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 248 ర‌న్స్ చేసి ఫాలోఆన్ ఆడింది.

భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (175), శుభ్‌మన్ గిల్‌(129) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్ల పడగొట్టాడు. అతడితో రవీంద్ర జడేజా, మ‍హ్మద్ సిరాజ్‌, జస్ప్రీత్ బుమ్రా కూడా రాణించారు.
చదవండి: అర్జున్‌ టెండూల్కర్‌కు గుడ్‌ న్యూస్‌.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు
 

 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)