ఓట‌మితో లెక్కలు తారుమారు.. ఇండియా-ఏ ఫైన‌ల్ చేర‌డం క‌ష్ట‌మే!

Published on Tue, 06/16/2026 - 11:34

ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక వెళ్లిన ఇండియా-ఏ జ‌ట్టుకు శ్రీలంక‌-ఏ చేతిలో సూప‌ర్ ఓవ‌ర్ ఓట‌మి ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఈ ఓట‌మి కార‌ణంగా ఇండియా-ఏ జ‌ట్టు ఫైన‌ల్ చేరే అవ‌కాశాలు సంక్లిష్టమ‌య్యాయి. శ్రీలంక‌-ఏ జ‌ట్టుతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించి శుభారంభం చేసిన ఇండియా-ఏ ఆ త‌ర్వాత అఫ్గానిస్తాన్‌-ఏతో జ‌రిగిన మ్యాచ్‌లో అనూహ్య ఓట‌మి చ‌విచూసింది. 

ఇక సోమ‌వారం లంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హైడ్రామా న‌డుమ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓట‌మిపాలై రెండో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచి ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొన‌సాగుతుంది.

ఆఫ్గ‌న్‌పై గెలిచినా..
బుధ‌వారం అఫ్గానిస్తాన్ జ‌ట్టుతో చివ‌రి లీగ్ మ్యాచ్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జ‌ట్టు త‌ప్ప‌క గెల‌వాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్‌లో గెల‌వ‌డ‌మే కాదు భారీ ర‌న్‌రేట్ స‌మ‌కూర్చుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. ఒక‌వేళ ఆఫ్గ‌న్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జ‌ట్టు ఇంటిదారి ప‌ట్టాల్సిందే. అదే స‌మ‌యంలో అఫ్గానిస్తాన్ జ‌ట్టు లంక‌తో జ‌రిగే త‌మ చివ‌రి మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం స‌మీక‌ర‌ణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గ‌న్‌పై ఇండియా గెలిచి, శ్రీలంక‌పై ఆఫ్గ‌న్ గెలిస్తే.. ఇరుజ‌ట్లు నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజ‌యాల‌తో ఉంటాయి.

కీల‌కం కానున్న నెట్ ర‌న్‌రేట్ 
అప్పుడు నెట్ ర‌న్‌రేట్ కీల‌కం కానుంది. ఈ రెండు జ‌ట్ల‌లో మెరుగైన ర‌న్‌రేట్ ఉన్న జ‌ట్టు ఫైన‌ల్లో అడుగుపెట్ట‌నుంది. అయితే ప్ర‌స్తుతం ర‌న్‌రేట్ విష‌యంలో అఫ్గానిస్తాన్ (-1.392)తో పోలిస్తే ఇండియా-ఏ (+0.330)ది పైచేయిగా ఉంది. ఒక‌వేళ ఆఫ్గ‌న్ లంక‌తో చివ‌రి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే మాత్రం మెరుగైన ర‌న్‌రేట్‌తో ఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశ‌ముంది. కాబ‌ట్టి ఆఫ్గ‌న్‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడదు అనుకుంటే వారిపై భారీ తేడాతో గెలవ‌డం ఇప్పుడు ఇండియా-ఏ జ‌ట్టు ముందున్న త‌క్ష‌ణ క‌ర్తవ్యం. 

అయితే శ్రీలంక‌తో మ్యాచ్‌లో టాపార్డ‌ర్‌, మిడిలార్డ‌ర్ పూర్తిగా విఫ‌ల‌మ‌వ్వ‌డం జ‌ట్టు కొంప‌ముంచింది. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో సూర్యాన్ష్ హెగ్డె, విప్ర‌జ్ నిగ‌మ్‌లు ఆడ‌కపోయుంటే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉండేది. శ్రీలంక‌తో మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జ‌ట్టు సూర్యాన్ష్‌ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్‌కు తోడు విప్రాజ్‌ నిగమ్ (51) సంచ‌ల‌న అర్థసెంచరీ చేయడంతో 49.2 ఓవ‌ర్ల‌లో 265 ప‌రుగులకు ఆలౌటైంది. 

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో లంక జ‌ట్టు కూడా 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 265 ప‌రుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో శ్రీలంక 16 పరుగులు చేయ‌గా, భారత్‌ 9 పరుగులకే పరిమిత‌మ‌య్యి ఓట‌మి చ‌విచూసింది.

Read: లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై నిషేధం తప్పదా!

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)