చెలరేగిన బ్యాటర్లు.. విజృంభించిన బౌలర్లు.. మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం

Published on Wed, 08/02/2023 - 03:19

విండీస్‌ పర్యటనలో టీమిండియా వరుసగా రెండో సిరీస్‌ నెగ్గింది. తొలుత 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకున్న భారత్‌.. నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి, రెండో వన్డేలో ఓటమిపాలైన భారత్‌.. మూడో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి విండీస్‌పై తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఇషాన్‌ కిషన్‌ (64 బంతుల్లో 77; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (92 బంతుల్లో 85; 11 ఫోర్లు), సంజూ శాంసన్‌ (41 బంతుల్లో 51;  2 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్ధిక్‌ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెపర్డ్‌ 2, అల్జరీ జోసఫ్‌, గుడకేశ్‌ మోటీ, కారియా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ  లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌ను భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి 151 పరుగులకే కుప్పకూల్చారు. శార్దూల్‌ ఠాకూర్‌ (4/37), ముకేశ్‌ కుమార్‌ (3/30),  కుల్దీప్‌ యాదవ్‌ (2/25), ఉనద్కత్‌ (1/16)  అద్భుతంగా బౌలింగ్‌ చేసి విండీస్‌ ఆటగాళ్ల పనిపట్టారు.  భారత బౌలర్ల ధాటికి విండీస్‌ 35.3 ఓవర్లలోనే చాపచుట్టేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో అలిక్‌ అథనాజ్‌ (32), కారియా  (19), అల్జరీ జోసఫ్‌ (26), గడకేశ్‌ మోటీ (39 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)