Breaking News

పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌

Published on Sun, 02/01/2026 - 21:22

అండర్‌ 19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పాకిస్తాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.

బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్‌ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఆఖర్లో కనిష్క్‌ చౌహాన్‌ (35), ఖిలన్‌ పటేల్‌ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌ (16), కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (0), అభిగ్యాన్‌ కుందు (16), దీపేశ్‌ దేవేంద్రన్‌ (1) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (30), విహాన్‌ మల్హోత్రా (21), అంబ్రిష్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో అబ్దుల్‌ సుభాన్‌ 3, మొహమ్మద్‌ సయ్యద్‌ 2, అలీ రజా, అహ్మద్‌ హుసేన్‌, మొమిన్‌ ఖమార్‌, అలీ హస్సన్‌ బలోచ్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్‌ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్‌ పటేల్‌ (9.2-1-35-3), ఆయుశ్‌ మాత్రే (8-0-21-3), కనిష్క్‌ చౌహాన్‌ (10-1-30-1), విహాన్‌ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్‌ (5-0-26-1), హెనిల్‌ పటేల్‌ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్‌ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. 

పాక్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖాన్‌ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్‌ (42), ‍కెప్టెన్‌ ఫర్హాన్‌ యూసఫ్‌ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్‌-2 నుంచి భారత్‌, ఇంగ్లండ్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. 

గ్రూప్‌-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ భారత్‌ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌ తలపడతాయి. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)