రోహిత్ భవితవ్యంపై టీమిండియా కోచ్‌ స్పందన!

Published on Fri, 07/17/2026 - 11:42

టీమిండియా స్టార్ క్రికెటర్‌ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ అతడి భవితవ్యంపై టీమిండియా మేనేజ్‌మెంట్ తొలిసారి స్పందించింది. 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్‌ను తప్పించినట్లు బీసీసీఐ ఇప్పటికే హిట్‌మ్యాన్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

లార్డ్స్ వన్డే రోహిత్ కెరీర్‌లో చివరిదని ప్రచారం నడుస్తోన్న వేళ టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ రిటైర్మెంట్‌పై సమాధానాన్ని దాటవేసిన సితాన్షు అతడి పేలవ బ్యాటింగ్ ప్రదర్శనపై మాత్రం స్పందించాడు. రోహిత్ శర్మపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.

అతడు పెద్ద ప్లేయర్ అని... అలాంటోడు భారత జట్టుకు అవసరమని పేర్కొన్నారు. రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్, యశస్వి జైష్వాల్ లకు ఓపెనర్ గా అవకాశాలు ఇస్తారా ? అని మీడియా అడిగిన ప్రశ్నలకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సమాధానం ఇచ్చారు. వరుసగా రెండు వన్డేల్లో విఫలమైనంత మాత్రానా రోహిత్ ఆటను జడ్జ్ చేయలేమని కుండబద్దలు కొట్టారు. 

నిజానికి రోహిత్ శర్మ ఒక టాప్ క్లాస్ ఆటగాడని కితాబిచ్చాడు. హిట్‌మ్యాన్ ఒకసారి టచ్ లోకి వచ్చాడంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదన్నాడు. ఇది ఇలా ఉండగా లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్ శర్మకు చివరిది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ భాగంగా జట్టులో కూడా రోహిత్ శర్మ లేడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్మెంట్‌పై ప్రశ్న వేయగా.. దీనికి మాత్రం సితాన్షు కోటక్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం ఆసక్తి కలిగించింది.

పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌
39 ఏళ్ల రోహిత్ శ‌ర్మ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అందుకోసం తాను ఫిట్‌గా ఉండేదుకు 10 కిలోల బ‌రువు కూడా త‌గ్గాడు. ఫిట్‌నెస్ నిరూపించుకున్న‌ప్ప‌టికీ బ్యాటింగ్‌లో మాత్రం వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతూనే వ‌స్తున్నాడు. స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో మూడు వ‌న్డేలు క‌లిపి 143 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక అర్ధ‌సెంచ‌రీ ఉంది. తొలి వ‌న్డేలో 69 బంతుల్లో 79 ప‌రుగులు చేసిన రోహిత్ రెండు, మూడు వ‌న్డేల్లో వ‌రుస‌గా 48, 16 ప‌రుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వ‌రుసగా రెండు వ‌న్డేల్లో 11, 26 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు.

Read: ‘రోహిత్ రిటైర్మెంట్‌ వార్తలపై కోహ్లి రియాక్ష‌న్!’

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)